ఆ జిల్లాలో వైసీపీ రూటే సపరేటు… షాకింగ్ అనిపించే ఆ హంగామా ఏంటో తెలుసా

విజయనగరం జిల్లాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ మంది మార్బలాన్ని ప్రదర్శించటానికి పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. ముఖ్యంగా ఈ కల్చర్ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో జోరుగా కనిపిస్తుంది. ఊరంతా ఫ్లెక్సీలు కట్టటం, వాడ వాడలా కేక్ లు కట్ చెయ్యటం, బట్టలు పంచటం, విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించటం, ఇక విందుల కోసం బోలెడంత ఖర్చు పెట్టటం పరిపాటి గా మారింది. వైసీపీ నేతల హడావిడి చూసి జనం విస్తు పోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీళ్ళ హడావిడి చూసిన ప్రజలు నోరెళ్ళబెడుతున్నారు.

ఓ పక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సన్నాహాలుగా తమ పుట్టినరోజు వేడుకలను నేతలు నిర్వహించుకుంటున్నారు. ఎవరివైపు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తమ కార్యక్రమానికి వచ్చిన వారినే తమ బలగంగా పరిగణిస్తున్నారు. బలనిరూపణ కోసం వార్డులవారీగా సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు.ఈ తరహా హడావిడిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ముందు వరుసలో ఉన్నారు. ఆ పార్టీ నేతల హంగామా చూసి జనం “ఔరా!” అని నోరెళ్లబెడుతున్నారు. ఈ జోరు, ఈ ఔదార్యం ముందే ప్రదర్శించి ఉంటే ఎంత బాగుండో అని అభిప్రాయపడుతున్నారు. తమ నాయకుడి పుట్టినరోజు వస్తోందంటే చాలు మూడు రోజుల ముందే పట్టణమంతా ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు ఇక పుట్టినరోజు నాడు కేకులు కట్‌ చేయటాలు హంగామా అంతా ఇంతా కాదు.

అదే రోజున వార్డుల్లో ఉన్న పేదవారికి కానుకల పంపణీ కూడా బాగానే జరుగుతోంది. ఒకవేళ తమ నాయకుడు ఆ రోజున లేకుంటే వారి పేరిట తయారుచేసిన కేకులను వారి అనుచరులే కట్‌చేసి పంపిణీ చేస్తున్నారు. ఇక కానుకలుగా బట్టలు, నగదు, సన్మానాలు, సత్కారాలు చేస్తూ వార్తల్లో వ్యక్తులవుతున్నారు.జిల్లాలో నెలకొన్న ఈ కొత్త ట్రెండ్‌ నానాటికీ విస్తరిస్తోంది. జనాలు విస్తుపోయేలా చేస్తుంది. వైసీపీ నేతల ఎలెక్షన్ స్టంట్ కు జనాలు షాక్ తింటున్నారు. ఎంతైనా వైసీపీ నాయకుల రూటే సపరేటు అంటున్నారు.

Facebook Comments