బ్రేకింగ్.. నాదెండ్లకు తప్పిన ఘోర ప్రమాదం

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఆయన సురక్షితంగా బయట పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న నాదెండ్ల మనోహర్‌ కారులో ఈ నెల 15వ తేదీన డ్రైవర్‌ రాజుతో కలిసి మాదాపూర్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లో హెరిటేజ్‌ వద్ద కారు మలుపు తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన లారీ (టీఎస్‌ 05 యుబి 2449) ఢీకొట్టింది. కారు వెనుక ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. మనోహర్‌ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు లారీ డ్రైవర్‌ నగరాజుపై ఐపీసీ 336, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook Comments