అక్కడ నుండే మోడీ పతనం… అందుకే ఈ సన్నాహం

భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం గా పెట్టుకున్నాయి ఆ రాష్ట్రాలు. మోడీ పాలన పారదర్శకంగా ఉంటుందని భావిస్తే అవినీతికి ఆలవాలంగా మారిందని ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చెయ్యాలని భావించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మోడీ హటావో నినాదంతో ముందుకు సాగానున్నారు. అయితే అన్ని రాష్ట్రాల కంటే బీజేపీ హయాంలో ఎక్కువ నష్టం జరిగిన రాష్ట్రం, ఎక్కువ కష్టం కలుగుతున్న రాష్ట్రం ఏపీ కావటంతో ఏపీ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో మోడీ కి బుద్ధి చెప్పాలని వ్యూహ రచన చేస్తున్నారు.

అందులో భాగంగా ఆయన మన ముందున్న ప్రధాన లక్ష్యం అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు సూచించారు.నిన్న ఉండవల్లిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో చంద్రబాబు పలు విషయాలపై చర్చించారు. త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలనీ, ఇక్కడి నుంచే మోదీ పతనం ప్రారంభం కావాలని చంద్రబాబు అన్నారు.

అధికార బీజేపీకి ప్రత్యామ్నాయగా థర్డ్ ఫ్రంట్ ని సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతి వంటి వారిని ఒకే తాటిపైకి తీసుకు రావాలనే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఇది దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని అన్నారు. అవసరం అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని చంద్రబాబు నిర్ణయించారు. మోడీ మీద చంద్రబాబు చేస్తున్న యుద్ధం రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే గానీ అందులో ఇంకే స్వార్ధ ప్రయోజనాలకు తావు లేదు. కేవలం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తున్న భావనతో ఉన్న చంద్రబాబు ఏపీ నుండే బీజేపీ పతనం ప్రారంభం కావాలని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీ కి వ్యతిరేఖంగా ప్రచారం చెయ్యటానికి కూడా సిద్ధంగా ఉన్న చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించనున్నారు.

Facebook Comments