అమరావతి దూకుడు…. జగన్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు..

రాష్ట్రంలో ని  ఇప్పటి పరీస్థీతులు చాలా  అందోళనకరంగా వున్నాయి. ఏక్కడ చూసినా కూడా రాజధాని ఆంశం నడుస్తుంది.అమరావతిలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాదాపు నెల రోజులుగా రాజధాని రైతులు నిరసనలు చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో శుక్రవారం మంగళగిరిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు లోకేష్ పొలిటికల్ జేఏసీ ఆధ్యర్యంలో ర్యాలీలో లోకేష్ బైక్ నడిపారు. సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

అనంతరం నవులూరు, ఎర్రబాలెం,పెనుమాక గ్రామాల్లో పర్యటించి దీక్షలు చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ నెల 20న చలో అసెంబ్లీకి మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు లోకేష్.మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ కమిటీ ఇప్పటికే మూడు రాజధానుల కాన్సెప్ట్‌కి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. అటు హైపవర్ కమిటీ సైతం శుక్రవారం జగన్‌తో సమావేశమై తుది చర్చలు జరిపింది. ఈ క్రమంలో శనివారం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అనంతరం 20న జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఏపీ రాజధానుల అంశంపై చర్చిస్తారు. ఐతే అసెంబ్లీ సమావేశం జరిగే రోజే పొలిటికల్ జేఏసీ చలో అసెంబ్లీకి పిలునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు పోలీసులు. అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందులు కలగకుండా భద్రతను మరింత పెంచబోతున్నారు.