అనంతలో ఆ కీలక నేతకు షాక్ ఇచ్చిన జగన్…ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఆ నేత

ఆ జిల్లాలో వైసీపీ జెండా ఎగరాలని జగన్ కలలు కంటున్నాడు. ఆ జిల్లాలో కీయక నాయకులకు సైతం గెలిచే దమ్ము ఉంటేనే టికెట్ ఇస్తా డబ్బు ఖర్చు పెట్టుకుంటా అంటేనే టికెట్ ఇస్తా లేకుంటే ఎవరినా కుబేరులను తీసుకొచ్చి టికెట్ ఇస్తా అని హెచ్చరిస్తున్నాడు. దీంతో ఇప్పటికే పార్టీని అన్ని జిల్లాలో జగన్ తన వ్యవహార శైలితో నాశనం చేస్తున్నాడు. గత ఎన్నికల అనుభవాలు మళ్ళీ ఎదురయ్యేట్టే ఉన్నాయి జగన్ కు. ఎందుకు ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. సార్ కు కావాల్సింది సీఎం కావటం అందుకోసం పార్టీ కోసం పని చేసిన వారి భవిష్యత్ ను కూడా పణంగా పెట్టేస్తారు అని వాళ్ళల్లో వాళ్ళే జగన్ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకూ అనేక జిల్లాల్లో సిట్టింగ్ ఇంచార్జ్ లను మార్చి డబ్బు మూటలు ఉన్న వాళ్ళకే సీట్లు అంటూ చెప్పుకొస్తున్న జగన్ మరోమారు తన పైత్యాన్ని చూపించుకున్నాడు.రాయల సీమ జిల్లాల్లో ముఖ్య జిల్లా అయిన అనంతపురం జిల్లా టీడీపీ కి కంచుకోట. అలాంటి జిల్లాలోపరిటాల ఫ్యామిలీ కి మంచి పేరుంది. . అయితే ఆ ఫ్యామిలీ పై నిలబడటానికే భయపడే వాళ్ళు ఉన్న క్రమంలో ఆ జిల్లాలో ఆ కుటుంబంపై 2009లో వైఎస్ఆర్ బలవంతంతో నిలబడి 1707 ఓట్లుతో ఓడిపోయారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. అయితే అనంతపురం జిల్లాలో వైకాపాకు ఉన్న బలమైన నాయకుల్లో ఒకరైన ఆయన వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు మెజార్టీ కనీసం 20 వేలకు తగ్గదనిభావించి భంగ పడ్డారు. కానీ కట్ చేస్తే పాపం మరోమారు 2014లో ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. అయితే 2019లో అయినా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అన్న ఆలోచనతో భారీగానే ఖర్చు పెడుతున్న ప్రకాష్ రెడ్డికి జగన్ షాక్ ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది.

జగన్ పార్టీనే నమ్ముకుని రెండు సార్లు ఖర్చు పెట్టి మరీ ఓ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీని డీ కొట్టాలంటే ప్రకాష్ రెడ్డి కి కష్టంగానే ఉంది అయినా సరే ఖర్చు ను లెక్క చెయ్యకుండా రెండు సార్లు పోటీకి దిగాడు. ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు అదే జగన్ ఆయుధం అయ్యింది. రెండు సార్లు పరిటాల ఫ్యామిలీపై ఓడిపోవడంతో జగన్ ప్రకాష్ రెడ్డిపై విశ్వాసం కోల్పోయాడట. మీకు అసలు ఈ సారి సీట్ ఎందుకు ఇవ్వాలి? 2009లో ఓడిపోయారు 2014లో ఓడిపోయారు ఈసారి ఎలా గెలుస్తారు? అంటూ జగన్ వారిని బహిరంగంగానే అడుగుతున్నాడట. అయితే గత ఎన్నికల్లో డబ్బు పెట్టలేక ఓడిపోయామని ప్రకాష్ రెడ్డి చెప్పారు. దీంతో జగన్ ఫైర్ అయ్యారట . గత ఎన్నికల్లో లేని డబ్బు ఇప్పుడు ఎలా వస్తుంది. అప్పుడు గెలవలేని వాళ్ళు ఇప్పుడు ఎలా గెలుస్తారు అని జగన్ ప్రశ్నిస్తూ, వచ్చే ఎన్నికల్లో సీట్ కావాలి అంటే ముందు ఆర్ధికంగా నీ దమ్మెంతో చెప్పాలని అడిగారట. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రకాష్ రెడ్డి, చాలా సీరియస్ గా తనకు ఉన్న సినిమా ధియేటర్ అమ్మకానికి పెట్టి 40 కోట్లకు తెగనమ్మాడట….తమకున్న ఆస్తులను తెగనమ్మి అయినా గెలవాలి అని, తానెంతో ఆశ పది కొనుకున్న సినిమా హాల్ అమ్మిన ఆ డబ్బుని వచ్చే ఎన్నికల్లో ఖర్చు చెయ్యడానికి రెడీ అయ్యాడట. తన పార్టీ కోసం నిజాయితీగా కష్టపడి స్థానికంగా పట్టు ఉన్న నాయకులకు ఆర్ధిక ఇబ్బందులు ఉంటె చంద్రబాబు వంటి నాయకుడు బాసటగా నిలిచినా సందర్భాలు ఎన్నో… కానీ జగన్ వంటి వాళ్ళు మాత్రం పైసలుంటే పార్టీలో ఉండు… లేకుంటే బయటకు నడువు అన్న చందం గా ఉన్నా ఆ పార్టీ నాయకులు అధినేత నైజం తెలిసి కూడా ఆస్తులు అమ్మి రాజకీయాల్లో పెడుతున్నారంటే గొర్రె కసాయిని నమ్మినట్టే.

Facebook Comments