రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అద్భుత టెక్నాలజీ..! దీని గురించి తెలుసుకోండి..?

టెక్నాలజీని మిక్స్ చేసి… రైతులకు ఎలా మేలు చేయాలో… ఏపీ ప్రభుత్వానికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. గతంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఏపీ ప్రబుత్వం..తాజాగా.. మాస్టర్ కార్డ్ సంస్థతో కలిసి వినూత్న యాప్ రెడీ చేసింది. రైతు ఉత్పత్తి స‌మాఖ్యల‌తో కోనుగోలుదారుల‌ను క‌లుపుతూ “ఈ రైతు” పేరుతో ప్రత్యేక వేదిక‌ను సృష్టించింది. ద‌ళారుల దోపిడీకి గుర‌వుతున్న చిన్న, స‌న్నకారు రైతుల‌ను ఆదుకునేందుకు ఇదో సాంకేతికతను ఉపయోగించుకుని చేస్తున్న ప్రయత్నం. ఫీచర్ ఫోన్ లో సైతం వినియోగించే సామ‌ర్ధ్యం ఉన్న ఈ మోబైల్ అప్లికేష‌న్ ను మాస్టర్ కార్డు రైతుల‌కు ఉచితంగా అందుబాటులోకి తేస్తోంద‌ి.

పూర్తిగా తెలుగులో రూపోందిన ఈ యాప్ ద్వారా వ్యవ‌సాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానంలో స‌మూల మార్పులు సాధ్యం అవుతాయ‌ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మాస్టర్ కార్డ్ తో క‌ల‌సి ఏపి ప్రభుత్వం “ఈ రైతు” యాప్‌ని అభివృద్ధి చేసింది. తెలుగులో కోనుగోలు దార్లును యాప్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. త‌మ వ‌ద్ద ఉన్న ఉత్పత్తి క్వాలిటీ, క్వాంటిటీ వివ‌రాలను తెలియ‌జేయ‌డం ద్వారా కోనుగోలు దార్లును ఆక‌ర్షించవచ్చు. పంటకు ఎక్కువ‌ధ‌ర‌ను రాబట్టుకోవ‌డంలోనూ ఈ యాప్ ఉప‌క‌రిస్తుంది. ఈ యాప్ ద్వారా రైతులు దేశవ్యాప్తంగా పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించలేని రైతులు… కూడా దీన్ని వాడుకోవచ్చు. ఫీచర్‌ ఫోన్‌లోనూ ఇది పని చేస్తుంది. ఈ యాప్ ద్వారా.. పంటల అమ్మకం ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు… మార్కెట్ పరిస్థితులనుకూడా తెలుసుకోవచ్చు. సమాచార విప్లవాన్ని అందుకుంటే.. రైతుకు…కలిగే లాభం అంతా .. ఇంతా కాదు.

ఈ యాప్‌ను రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు.. అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం… కొన్ని ప్రత్యేకమైన సదస్సులు నిర్వహించనుంది. మాస్టర్ కార్డ్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఫిన్ టెక్ కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ ఏది చేపట్టినా సక్సెస్సే., ఈ యాప్ రైతులకు మేలు చేస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు.

Facebook Comments