ఏపీలో ఉత్కంఠ పరిస్థితులు.. ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయా..?

ప్రస్తుతం ఇప్పుడు వున్న పరీస్థీతులలో ఏపీలో రాజకీయంగా ప్రతిపక్షాల పార్టీల అలోచనలన్ని ఓకేలా వున్నాయి.ఏపీలో రాజకీయ పరిస్థితులు రకరకాలుగా మారిపోతున్నాయి.అధికార పార్టీ వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ విపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడేందుకు అడుగులు వేస్తున్నాయి.ఇప్పటికే బిజెపి, జనసేన పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం, ఇప్పుడు అదే దారిలో టిడిపి కూడా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.దీనికి అమరావతిని వేదికగా చేసుకుని అడుగులు వేయాలని ఈ మూడు పార్టీలు చూస్తున్నాయి.ఈ మధ్య జరిగిన ఎన్నికలకు ముందు టిడిపి, బిజెపి పార్టీలు ఎవరికి వారు విడివిడిగా పోటీ చేశారు.అయితే అలా చేయడం ద్వారా ఎప్పుడు చవిచూడని ఫలితాలను చవిచూశారు.దీన్నే అవకాశంగా మార్చుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.అప్పటి నుంచి టిడిపి పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, నాయకులు కూడా పక్క పార్టీల వైపు చూస్తూ పార్టీని విమర్శిస్తూ రాజీనామా చేసి బయటకి వెళ్లిపోతున్నారు.ఈ పరిణామాలు టిడిపిలో కలవరం పుట్టిస్తున్నాయి.

 

వీటన్నింటి నుంచి బయటపడేందుకు టిడిపి ప్రజా పోరాటాలు చేయడమే మార్గంగా ఎంచుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.అందుకే అమరావతి రాజధాని తరలించడానికి కుదరదు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.చంద్రబాబుకు నమ్మిన బంతులుగా ఉంటూ వచ్చిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరు బీజేపీలోకి చేరిపోయారు.వారితో పాటు మరికొందరు టిడిపి నాయకులు ఆ పార్టీలో చేరారు.అయితే వీరంతా బాబు ఆదేశాల మేరకే పార్టీలో చేరారని వాదనా లేకపోలేదు.ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ పొందే దిశగా అడుగులు వేస్తోంది.టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజన, సీఎం రమేష్ ల ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.బిజెపి, జనసేన సపోర్ట్ ఉంటే వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని టిడిపి చూస్తోంది.ఇదే ఆలోచనతో జనసేన.బీజేపీ కూడా ఉండడంతో టిడిపి ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మూడు పార్టీలు కలిసి వెళ్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది ? జనసేన బిజెపి కలిసి వెళితే ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనే విషయంపై బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు.