అరవింద సమేత లో సర్ ప్రైజ్ చేసేది ఎవరో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా విశేషాల గురించి చెప్పాలంటే అన్నీ ఇన్నీ కావు. ప్రేక్షకులను సినిమా క్రూ ఒక ఫేమస్ క్యారెక్టర్ ను గురించి ఇప్పటి వరకు రివీల్ చెయ్యకుండా సర్ ప్రైజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

అర్ర్జీవీ సవాల్ లతో భారీ అంచనాల నడుమ వస్తున్నా ఈ సినిమాకు ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్ లైన్. తండ్రి మరణం తర్వాత షెడ్యూల్ ఆగిపోతుంది అని భావించినా తండ్రి బాటలో నడిచి సినిమాను ముందుకు నడిపిస్తూ శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతిత్వరలో ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ డీటెయిల్స్ తెలపనున్నారు.

ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేందుకు గాను ‘అరవింద సమేత’లో రివీల్ చెయ్యని క్యారెక్టర్ ఎవరిదో కాదు బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌దే అని వార్తలు వస్తున్నాయి. చిత్రంలో అమితాబ్ అతిథి పాత్రలో కనిపిస్తాడని, ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచారని తెలుస్తుంది . ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఎన్టీఆర్ దూకుడుకు తోడు బిగ్ బీ టచ్ కూడా ఉందంటే మాత్రం ‘అరవింద సమేత’ పై భారీ అంచనాలు పెట్టుకోవటం తప్పు లేదని సినీ వర్గాల అభిప్రాయం.

Facebook Comments