ఎన్టీఆర్ ` అరవింద సమేత ` రివ్యూ & రేటింగ్

చాన్నాల్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రం కాంబో అరవింద సమేత వీర రాఘవ . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింన ఈ సినిమా దసరా సందర్బంగా ఈ రోజు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ

సిటీలో ఉండే వీర రాఘవ ( ఎన్టీఆర్ ) ఒకానొక సమయంలో అరవిందను ( పూజా హెగ్దె ) చూసి ఇష్ట పడతాడు. అమె చుట్టూ ఎంతో అమాయకంగా తిరుగుతున్న వీర రాఘవకు అరవిందకు వచ్చిన ప్రమాదంలో నుండి బయటపడేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో తానెవరు, తన గతమెమిటన్నది రివీల్ చేస్తాడు. రాయలసీమ వాడైన వీర రాఘవ సిటీకి ఎందుకొచ్చాడు. వీర రాఘవ అసలు విశ్వరూపం ఏంటి.. అది ఎలా బయటపెట్టాడు. శత్రువులను వీర రాఘవ ఎలా మట్టుపెట్టాడు.. అసలు యుద్దం చేసాడా..? వాళ్ళలో మార్పు తీసుకొచ్చాడా..? అన్నది తెరపి చూడాల్సిందే..

నటీ నటుల ప్రతిభ :

తనకు తగ్గ పాత్ర దొరికితే ఎలాంటి పాత్రనైనా ఇరగదీసే ఎన్టీఆర్, వీర రాఘవ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. త్రివిక్రం డైరెక్షన్ కు తారక్ నటన తోడవ్వడంతో కీలక సన్నివేషాలు అద్భుతంగా వచ్చాయి. హీరోయిన్ పూజా హెగ్డే కూడా పరిది మెరకు బాగానే నటించింది. తన క్యూట్ లుక్స్ తో, హవాభావాలతో అకట్టుకుంది. తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా అకట్టుకుంది. చాలా రోజుల తర్వాత కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా మెప్పించాడు. ఇక జగపతి బాబు విషయానికి వస్తే విలనిజంలో మరోసారి తనకు సాటిలేరని నిరూపించాడు. అంత గొప్పగా చేసాడు జగపతి బాబు. ఇక నవీన్ చంద్ర కూడా విలన్ కొడుకు పాత్రలో మెప్పించాడు.

సాంకేతికవర్గం పనితీరు :

ఈ సినిమాలో ముందుగా సాంకేతికంగా చెప్పుకోవాల్సింది తమన్ మ్యూజిక్ గురించి. రెండు పాటలు సో సో గా ఉన్నా బీజీఎమ్ తో అదరగొట్టేసాడు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ అదిరిపోయింది. ఇక కథ, కథనాల్లో దర్శకుడు త్రివిక్రం మళ్లీ తన ఫాం లోకి వచ్చాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు.

విశ్లేషణ :

యుద్దం చేయడం, గెలవడం ముఖ్యం కాదు, యుద్దం ఆపేయడమే ముఖ్యం అనే లైన్ మీద స్టోరీ రాసుకున్నాడు త్రివిక్రమ్. టైటిల్ తోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పాడు త్రివిక్రం. ఎన్.టి.ఆర్ తల్లి పాత్రతో పాటుగా అరవింద పాత్రతో తానేం చేయాలో తెలుసుకుంటాడు వీర రాఘవ. సినిమా కథ చాలా గొప్పగా రాసుకున్నాడు త్రివిక్రం. కథ చెప్పడానికి చాలా సింపుల్ గా అనిపించినా దాన్ని కన్విన్స్ చేసేందుకు ఆయన ఎంచుకున్న కథనం అదిరిపోయింది. ముఖ్యంగా సినిమాలో పాత్రలన్ని ఏదో వచ్చి వెళ్తున్నాయ్ అన్నట్టుగా కాకుండా కథకు అవసరమయ్యేట్టుగా రాసుకున్నాడు. ఇక డైలాగుల విషయంలో అయితే త్రివిక్రం పెన్ పవర్ ఏంటో చూపించాడు.

కథ, కథనాలే కాదు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ హంగులతో అరవింద సమేత వచ్చింది. తప్పకుండా ఎన్.టి.ఆర్ కెరియర్ లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎమోషనల్, సెంటిమెంటల్ మూవీగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చూడదగిన సినిమా ఇది.

ప్లస్ పాయింట్స్ :

ఎన్.టి.ఆర్ నటన

త్రివిక్రం డైలాగ్స్

బిజిఎం

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ఏమి లేవు

బాటం లైన్ :

అరవింద సమేత వీర రాఘవ.. త్రివిక్రం, తారక్ అంచనాలకు తగిన సినిమా..!

రేటింగ్ : 3.5/5

Facebook Comments