అరవింద @ 400…సినిమాలో అంతుందా…?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోతో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ సెన్షేష‌న్ మూవీ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇక, ఎన్టీఆర్‌కు మ‌రో కంచుకోట‌గా భావించే రాయ‌ల‌సీమ ఏరియాల్లోనూ, ఈ సినిమా ఊహ‌కంద‌రి రీతిలో రిలీజ్ కాబోతున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటికే 400 ధియేటర్లలో సినిమా రిలీజ్ కాబోతుండగా టికెట్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. ప్రీ బుకింగ్ చూస్తే అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తుంది.

ఇక బాక్సాఫీసు వ‌ద్ద 93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను అందుకున్న ఈ సినిమా 94 కోట్ల రూపాయ‌ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగుతుండ‌గా, అన్ని ఏరియాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఆదివారం నుంచి మొద‌లైంది. అడ్వాన్స్ బుకింగ్ అలా మొద‌లైందో.. లేదో.. అద్దిరిపోయే రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కు రెస్పాన్స్ వ‌చ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే రికార్డ్ లెవ‌ల్లో అర‌వింద స‌మేత అడ్వాన్స్ బుకింగ్ జ‌రిగింద‌ని సినీ ట్రేడ్ విశ్లేష‌కులు చెప్పారు. 400 టికెట్ ధర పలికినా సరే పోటీ పడి మరీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ధరలు పెంపు విషయంలో ఆంధ్రాలో అఫీషియల్ గా జీవో తెచ్చి 200రూపాయలకు అమ్మాలని భావిస్తున్నారు. కానీ సినిమాకున్న క్రేజ్ తో చూస్తే 400 టికెట్ అమ్మినా హాట్ కేకుల్లా పోయేలా వున్నాయి. విపరీతమైన ప్రీ బుకింగ్ హంగామా చూస్తే తొలి వారంలోనే 100 కోట్ల బిజినెస్ చేస్తుందనే అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు.ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తాగ్యారేజ్ ఇక్క‌డ 320 థియేట‌ర్స్‌లో, జై ల‌వ కుశ సినిమా 350 థియేట‌ర్స్‌లో రిలీజ్ అవ‌గా, ఈ సారిమాత్రం ఆ లెక్క 390కు చేరుకునేఅ వ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. చివ‌రి నిమిషంలో ఈ లెక్క 400కు చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని చెబుతుండ‌టం విశేషం.ఓవ‌రాల్‌గా రాయ‌ల‌సీమ‌లో ఉన్న థియేట‌ర్ల సంఖ్య 450 నుంచి 500 లోపు ఉంటాయి. ఈ సారి అర‌వింద స‌మేత సినిమాను ఆల్‌మోస్ట్ 90 శాతానికిపైగా థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు.

రాయ‌ల‌సీమ ఏరియాలో మొద‌టి రోజు హైయ్యెస్ట్ క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ కుశ సినిమా తొలి రోజు 4.3 కోట్లుకు పైగా షేర్ అందుకుని సంచ‌ల‌నం సృష్టించ‌గా.. ఇప్పుడు ఆ రికార్డును అర‌వింద స‌మేత వీర రాఘ‌వ బ‌ద్ద‌లుకొట్టే అవ‌కాశం పుష్క‌లంగా ఉంద‌ని సినీ విశ్లేష‌కుల నోట గ‌ట్టిగా వినిపిస్తుంది. భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లు భారీగా రెట్లు పెంచి అమ్మకుంటే గిట్టుబాటు కాదు. కాబట్టి రేట్లు పెంచి అమ్మకాలు చేసినా 400 ధియేటర్ లలో రిలీజ్ అవుతుంది కాబట్టి 400 టికెట్ ధర చేసినా సినిమా చూసి తీరతాం అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. నాన్ బాహుబలి రికార్డ్ లను బద్దలు కొట్టిన అరవిందుడి హంగామా ముందు ముందు ఎలా ఉంటుందో ..

Facebook Comments