ఆయన గురించి నాకు చెప్పకండి … ఆయనేంటో నాకు తెలుసన్న చంద్రబాబు… అదీ బాబంటే

సోషల్ మీడియా ప్రాధాన్యత ఎక్కువైన ఈ రోజుల్లో ఏది రియల్ ఏది ఫేక్ అన్నది అర్ధం కావటం లేదు . అనవసర విషయాలు, అబద్ధాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా రాజకీయ పార్టీలను అనిశ్చితి వాతావరణంలోకి నెడుతున్నాయి. ఆ పార్టీ నేత జంపా … ఈ పార్టీ నాయకులతో రహస్య మంతనాలు చేశారా ? త్వరలో పార్టీ మారనున్న ఆ నేత అంటూ తప్పుడు వార్తల్ని సోషల్ మీడియా లో ప్రచారం చెయ్యటం కామన్ అయిపోయింది.

సోషల్ మీడియా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేతలపై చేస్తున్న ప్రచారాలకు హద్దు లేకుండా పోయింది. ఇది దేశ రాజకీయాల్లో ఎలా ఉందోకానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా ఎక్కువగా వుంది. ముఖ్యంగా ఏపీలో ఫ్యాన్ కు భజన చేసే సోషల్ మీడియా టీడీపీలో అనిశ్చితి క్రియేట్ చెయ్యటం కోసం ఏకంగా జగన్ నే కలిశాడు ఆమంచి అని ప్రచారం చేసింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అవుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. వైఎస్ కు వీర విధేయుడైన ఆమంచి గత ఎన్నికల సమయంలో జగన్ సీటు ఇవ్వలేదు అనే కారణంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటి తో విజయం సాధించారు. ఆ తర్వాత టీడిపిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ఆయనపై స్థానికంగా మంచి అభిప్రాయం వుంది. గత నాలుగేళ్ల కాలంలో ఈయనపై విపక్షాలు చేసిన ఆరోపణలు కూడా చాలా తక్కువ.

ఇక జగన్ తో భేటి అవుతున్నారు అనే ప్రచారంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు. బాబు కు ఈ విషయంపై చెప్పుకొచ్చారు. జగన్‌కు చెందిన మీడియా ప్రతినిధులు కొందరు ఏకంగా జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద ఉండి లోటస్‌ పాండ్‌కు ఎన్ని గంటలకు వస్తున్నారు’ అని కృష్ణమోహన్‌కే ఫోన్‌ చేసి అడిగారట. దీనితో ఆయన కంగుతిన్నారని తెలిసింది.
తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమంచి విషయమే హైలెట్ అయింది. దీంతో చంద్రబాబు ఆమంచి గురించి నాకు తెలుసు.. అనవసరంగా ఏదో విని మీరు నాకు చెప్పకండి.. ఏం చెప్పినా నాకు చెప్పే చేస్తారు. ఆయన రాజశేఖర్ రెడ్డి భక్తుడు కావచ్చు గాని జగన్ కు కాదు. అందుకే అప్పుడు ఆ పార్టీలో వెళ్ళారు.’ అని నేతలకు చెప్పారు. బాబు చెప్పిన విషయం తో టీడీపీ నేతలు చంద్రబాబు నమ్మకం ఎలా ఉంటుందో అర్ధం చేసుకున్నారు. తన సన్నిహితుడు బీదా మస్తాన్ రావు మీద ఐటి దాడులు జరుగుతుంటే ఒక రోజు ఎక్కువ చెన్నైలో ఉండి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారట. ఆ సమయంలో జగన్ తో భేటీ అయ్యేందుకు వెళ్ళారని వైసీపీ మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అనవసరంగా అభద్రతా భావానికి గురి చేసేలా ప్రచారం జరిగినా ఏదైనా ఆమంచి మీద ముఖ్యమంత్రికి ఉన్న నమ్మకం ఏంటో మంత్రులకు, ఇటు ఆమంచికి కూడా తెలిసింది.

Facebook Comments