పాలకొల్లులో ఉత్కంఠ..! ఆయనొస్తే వైసీపీ నెలమట్టం ఖాయం..!

ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. అటు వైసీపీలో, ఇటు టీడీపీలో జంపింగ్ ల పర్వం కొనసాగుతుంది. ఊగిసలాట ధోరణిలోవున్న నేతలపై దృష్టి సారిస్తున్నాయి. వేర్వేరు పార్టీల్లోవున్న బలమైన నాయకులకు వల విసురుతున్నాయి. రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీలు మారే అవకాశం ఉన్న వారిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

ఎవరు ఏ పార్టీలో ఉంటారో ? ఎవరు ఎప్పుడు జెండా మారుస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఓ కంట గమనిస్తున్నాయి. ఒకవైపు ఆయా పార్టీలు అంతర్గతంగా నిఘా కన్ను తెరిస్తే, మరోవైపు ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఎప్పటికప్పుడు జంపింగ్‌లపై కూపీ లాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రధాన పక్షాలలో టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆయనను పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదు.ఇప్పుడున్న  పరిస్థితుల్లో అధికార తెలుగుదేశం నుంచి.. బీజేపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లే అవకాశమున్న వారు ఎవరనే విషయంపై రెండు, మూడు రోజులుగా నిఘా వర్గాలు వివరాలు సేకరిస్తున్నారు. పార్టీలో సీనియర్‌ నేతలను అడుగుతున్నారు.

తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలపై చర్చిస్తున్నారు. టీడీపీలోని ఒక మహిళా నాయకురాలు జనసేనలోకి వెళతారనే ప్రచారంపై దృష్టి పెట్టారు. బీజేపీకి చెందిన సీనియర్‌ నేత డాక్టర్‌ బాబ్జి విషయంలో టీడీపీ, జనసేన, వైసీపీ తమ పార్టీల్లోకి రావాలని ఆహ్వానించాయి. ఆయన ఎవరికీ ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి త్వరలో పాలకొల్లు రానున్నారు. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఆ నేత వైసీపీలోకి వస్తే.. ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం ఖాయం.

Facebook Comments