బాబు టార్గేట్ గానే ఈడీ దాడులు… టీఆర్ ఎస్ నేతను కూడ వదలరా..?

ఏపీలో ఐటీ దాడులు.. తెలంగాణలో ఒక నాయకుడిపై ఈడీ దాడులకు సంబంధం ఉందా అంటే ఇప్పుడు ఈడీ దాడులు జరుగుతున్న నేత ఒకప్పుడు టీడీపీ అని చెప్తున్నారు. ఒకప్పుడు అయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అని చెప్తున్నారు. ఒక వేళ అదే నిజమైతే ఏపీ లో లాభం లేక తెలంగాణలో బాబును ఇరికించటం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తుందా అని ఆలోచించాలి. లేదంటే బాబు పార్టీ లో గతంలో ఉన్నంత మాత్రాన బాబుకు వాళ్ళ లావాదేవీలతో ఏమి సంబంధం అని ప్రశ్నించాలి.

ఇప్పుడు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో జరుగుతుంది అదే. ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా అంతా చంద్రబాబు మీద నున్దేపోతుంది. అంతగా అందరికీ టార్గెట్ అయ్యారు చంద్రబాబు. యదార్ధవాడి లోక విరోధి అన్న మాట ఉందనే వుంది కదా అందుకే ఏపీ కి జరిగిన అన్యాయం విషయంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన బాబు అంటే ఇప్పుడు కేంద్రం నిప్పులు చెరుగుతుంది. ప్రతిపక్షపార్టీలు తుమ్మినా దగ్గినా బాబు తప్పే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు ఒకప్పటి చంద్ర‌బాబు స‌న్నిహితుడు, మాజీ సీబీఐ డైరెక్ట‌ర్ విజ‌య‌రామారావు త‌న‌యుడి పై ఈడీ రైడ్స్ తో ఏపీలో ప‌లువురు ముఖ్యుల వ్య‌వ‌హారం విజ‌య‌రామారావు త‌న‌యుడు శ్రీనివాస క‌ళ్యాణ‌రావుతో ముడిపడి ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ప‌లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసుల్లో ఆయ‌న నిందితుడిగా ఉన్న ఆయనపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. . బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ గా ఉన్న సమయంలో కళ్యాణరావు బ్యాంకుల కన్సార్టియం నుంచి మొత్తం 304 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టార‌ని చెబుతున్నారు. దాంతో ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈడీ తెర‌మీద‌కు వ‌చ్చింది. ప‌లు చోట్ల త‌నిఖీలు చేసింది.అయితే ఈ వ్య‌వ‌హారం తాజాగా జ‌రిగిన ఐటీ దాడుల‌కు కొన‌సాగింపుగానే క‌నిపిస్తున్నాయ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఏపీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌కు, తెలంగాణాకు చెందిన తెరాస నాయకుడు మాజీ మంత్రి విజ‌య‌రామారావు కుటుంబ వ్య‌వ‌హారాల‌కు ముడిపెట్ట‌డం ప‌ట్ల కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే వ‌రుస‌గా సాగుతున్న ప‌రిణామాల వెనుక ఎక్క‌డో ఓ కీల‌క‌మైన ముడి ఉంటుంద‌నే సందేహం వెలిబుచ్చుతున్నారు. అయితే ఆయన చంద్రబాబు సన్నిహితుడు ఒకప్పుడని తర్వాత తెదేపా కష్టాల్లో ఉన్నా వదిలేసి తెరాస లో చేరారని, అటువంటి నాయకుడు చంద్రబాబు కి సన్నిహితుడు ఎలా అవుతాడో చెప్పాలని టీడీపీ అంటుంది. ఎవడు ఏం చేసినా ఎవరి మీద ఏ దాడులు జరిగినా చంద్రబాబే టార్గెట్ గా జరుగుతున్న ప్రచారం కేవలం రూమర్. కేంద్రం చేసే ప్రతి పని చంద్రబాబు కోణంలో నుండి కాకుండా చూడాల్సిన అవసరం వుంది.

Facebook Comments