కేసీఆర్ కి బాబు టెన్షన్ !

అన్ని ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు .. ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడుతుంటాడు అనే సామెతకు తగ్గట్టుగా కేసీఆర్ తెగ రెచ్చిపోతున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుని ఆయన మాటల తూటాలు వదులుతున్నాడు. అయితే… కేసీఆర్ ఏ రేంజ్ లో విరుచుకుపడుతున్న బాబు మాత్రం లైట్ తీసుకుని వదిలేస్తున్నాడు. కేసీఆర్కే వాడుతున్న భాష ఆయన అభినానులకు జోష్ తెచ్చిపెడుతున్నాయి … అసలు విషయం మాత్రం వేరేగా ఉంది. కేసీఆర్ చేతకానితనానికి ఈ ఉపన్యాసాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి అనే వ్యాఖ్యలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

కేసీఆర్ తన పరిపాలనా కాలంలో తెలంగాణాకు ఏమి చేసాడో చెప్పుకోవడం లేదు సరికదా, కనీసం తన ఎన్నికల ప్రచార సభల్లో ఆ ప్రస్తావన కూడా తీసుకురావడంలేదు. దశాబ్దాల అన్యాయాన్ని కేసీఆర్ తుడిచివేస్తున్నట్లయితే ఆ సంగతి చెప్పడానికి ఒక గంట కాదు కదా 24 గంటల పాటు మాట్లాడినా చాలదు. కానీ, కేసీఆర్ తాను మాట్లాడే అరగంటో గంటో సమయం మొత్తం చంద్రబాబును, ఇతర ప్రత్యర్థులను తిట్టడానికే ఎందుకు కేటాయిస్తున్నారన్న ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది. ఒకప్పటి కేసీఆర్ ఉపన్యాసాలు. కానీ, ఇప్పుడేదీ ఆ వాగ్ధాటి. ప్రత్యర్థులను నోటికొచ్చిన బాషలో తిట్టడాన్ని బట్టి చూస్తే… ఓటమి భయంతో కలుగుతున్న అక్కసుతో చేస్తున్న తిట్ల దాడిలా కనిపిస్తోంది.

ప్రగతి నివేదన సభ నుంచి మొదలుపెట్టి కేసీఆర్ ఉపన్యాసాలను పరిశీలిస్తే ఆయనలోని అసహనం స్పష్టంగా అర్థమవుతోంది. మాటల్లో పస ఉండడం లేదు. ప్రత్యర్థులను నానా తిట్లు తిట్టడం, ఎగతాళి చేయడం, దురహంకారంతో మాట్లాడడం, వెకిలి జోకులేయడం ఎక్కువైంది. ఇది చాలామందికి అక్కడికక్కడ నవ్వు తెప్పించొచ్చేమీ కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అది కేసీఆర్ వైఫల్యాన్నితెలియజేస్తోంది. ఈ విషయాన్ని కేసీఆర్ గ్రహించలేకపోతున్నాడు. బాబు ను ఎంత తిడితే అంత గొప్పనుకుంటున్న కేసీఆర్ పరోక్షంగా బాబు కి ప్రజల్లో సానుభూతి తీసుకువస్తున్నాడు.

Facebook Comments