హరికృష్ణ కోసం బాలయ్య ఏం చేస్తున్నాడో తెలుసా

నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ బయో పిక్ తీస్తున్నారనే విషయం అందరికీ తెలుసు . మొదట తేజ డైరక్షన్ లో తియ్యాలని భావించినా ఆ సినిమా కాస్త తేజ తప్పుకోగా క్రిష్ చేతుల్లోకి వచ్చింది. సినిమా కు అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా బాల కృష్ణ మాత్రం మొక్కవోని పట్టుదలతో సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హరి కృష్ణ పాత్రను చాలా గొప్పగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట బాలయ్య .

ఈమధ్య సడన్ గా షాకింగ్ కి గురి చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారు హరి కృష్ణ. హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ బయోపిక్ కి మరి కొంతకాలం బ్రేక్ పడుతుంది అనుకుంటే బాలకృష్ణ మాత్రం సినిమా ఆగకుండా ఎన్టీఆర్ స్వగృహంలోనే సినిమా షూట్ చేస్తున్నారు . అయితే ఈ సినిమాలో మొదట హరి కృష్ణ పాత్ర ను సాధారణంగా అనుకున్నప్పటికీ హరికృష్ణ మరణం తర్వాత ఆయన ఎన్టీఆర్ కోసం, కుటుంబం కోసం, పార్టీ కోసం చేసిన కృషిని తెలియజెప్పాలని భావిస్తున్నారట బాలయ్య.

ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ పాత్ర ముఖ్యమైనదని, ఎన్టీఆర్ చైతన్య రథానికి హరికృష్ణ సారధిగా ఉంటూ వచ్చిన తీరు తండ్రి తర్వాత రాజకీయ వారసత్వం తీసుకునే అవకాశం ఉన్నా సరే కుటుంబ బాధ్యతలను మీద వేసుకున్న వ్యక్తి గా హరికృష్ణ నందమూరి కుటుంబాన్ని నడిపించారు. ఆయన మరణానికి ముందు హరికృష్ణ రోల్ లో కళ్యాణ్ రామ్ ను అనుకొని ఆ పాత్రను సామాన్యంగా రాసుకున్నారు కాని ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారట. చైతన్య రధాన్ని ఆయన నడిపించిన తీరు అందుకు ఆయన పడిన కష్టం అంతా తెర మీద చూపిస్తున్నారట. తన తండ్రి మీదే కాదు తన అన్న మీద బాలకృష్ణకున్న ప్రేమకు ఇది నిదర్శనం. ఈ సినిమాలో గొప్పగా రూపు దిద్దుకుంటున్న హరి కృష్ణ పాత్ర ఆయనకు నిజమైన నివాళి.

Facebook Comments