పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బండ్ల గణేష్..!

బండ్ల గణేష్ … ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఈ పేరు తెలియని వారుండరు. నటుడిగా పరిచయమై నిర్మాతగా మారిన బండ్ల గణేష్ మొదటి నుండి చిరంజీవి కుటుంబానికి వీర విధేయుడు. పవన కళ్యాన్ నాకు గురువు, దేవుడితో సమానం అని చెప్పుకునే బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అయితే జన్సేన మీద వల్లమాలిన అభిమానం చూపించే ఈ వీర భక్తుడు జనసేనలో ఎందుకు చేరలేదు అని రాజకీయంగా చర్చ సాగుతుంది.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లో చేరారు. రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్యాగాలకు ప్రతిరూపం కాంగ్రెస్‌ పార్టీ అని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ అన్నారు. కాంగ్రెస్‌ అంటే ఇష్టం కావడంవల్లే ఆ పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ ఏదీ చెబితే అది చేస్తానన్న బండ్ల గణేష‌..ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తనకు దేవుడితో సమానమనీ అయినా సరే తాను కాంగ్రెస్‌ అభిమానినన్నారు..బండ్ల గణేష్‌. జనసేనాని దేవుడు అంటూనే కాంగ్రెస్ పంచన చేరటం వెనుక అంతరాయం బోధ పడక కొందరు తలలు బాదుకుంటుంటే టికెట్ ఇస్తున్నందుకే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారని చర్చ సాగుతుంది.

తెలంగాణా నుండి పోటీ చెయ్యాలనే పార్టీ లో చేరిన బండ్ల గణేష్ జనసేనకు తెలంగాణాలో పట్టు తక్కువగా వున్న నేపధ్యంలో జనసేనలో చేరితే బాగుండేది కదా అని అనుకుంటున్నారు.మరి పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరటంపై స్పందిస్తారో లేదో చూడాలి.

Facebook Comments