అమ్మ జగన్… ఆ అంబులెన్స్ వెనుక ఇంత కధ ఉందా..!?

ఈ కధనం వింటే జగన్ చావు తెలివితేటలు ప్రదర్సిస్తున్నారని టీపీపీ నేతలు మండిపడడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. ముందుగా విషయం చూద్దాం. మొన్న తన పాదయాత్రలో భాగంగా ఒక చిన్నసభలో జగన్ ప్రసంగిస్తుండగా ఒక 108 అంబులెన్సు ఆ సభకు వచ్చిన జనం మధ్యలో చిక్కుకుపోయింది. ఆ వెంటనే జగన్ తన ప్రసంగాన్ని ఆపి అంబులెన్స్ దాటి ఇవ్వమని జనాన్ని కోరడం అక్కడి పోలీసులు అంబులెన్స్ ను అక్కడి నుంచి పంపించడం తెలిసిందే. ఈ సంఘటన మొత్తం ఎవరో వీడియో తీసి నెట్లో పెట్టారు. ఇంకేముంది జగన్ అభిమానులు అనబడే సోషల్ నెట్వర్క్ టీం రంగంలోకి దిగిపోయి జగన్ పెద్ద మనసును పొగుడుతూ ఆ వీడియోను వైరల్ చేసింది. ఈయహే తాజాగా ఆ అంబులెన్స్ గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ నేతలు చెప్పినట్లు వైసిపి కేడర్ చావు తెలివితేటలు బయటపడ్డాయి. ఈ అంబులెన్స్ కహానీ వెనుక ఎమ్ జరిగిందో టీడీపీ నేత, మంత్రి దేవినేని ఉమ సవివరంగా వెల్లడించారు.

ఇదే అంబులెన్స్ కి సంబంధించి జగన్ మరో నీచమైన ఆరోపణ కూడా చేసారు. జగన్ వచ్చిన అంబులెన్స్‌ను ప్రభుత్వమే పంపించి వికృత చర్యలకు పాల్పడుతుందని జగన్ శాపనార్థాలు పెట్టడం.. ఆ అంబులెన్స్‌కు దారిచ్చి పంపాలని జగన్ సభకొచ్చిన కార్యకర్తలకు పిలుపునివ్వడం.. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పై డ్రామాకు తోడు అసలు ఆ అంబులెన్స్‌లో పేషెంటే లేడని జగన్ చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే జగనే ఈ డ్రామాకు తెరలేపాడని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించాయి. అయితే హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశంపై మంత్రి దేవినేని ఉమ స్పష్టత ఇచ్చారు. ఆ సభలో పాల్గొన్న ఒక వైసీపీ కార్యకర్తకు దెబ్బతగిలితే ఆ పార్టీ కార్యకర్తలే అంబులెన్స్ పంపించాలంటూ ఫోన్‌ చేశారని దేవినేని ఉమ తెలిపారు. ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోకుండా జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సభలో జగన్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. 108 అంబులెన్స్‌ వస్తే ప్రభుత్వమే పంపించిందంటావా? అని ప్రశ్నించారు. సభకు వచ్చిన ఓ వ్యక్తికి ప్రమాదం జరిగి గాయాలైతే అతడిని అంబులెన్స్‌లో తీసుకొస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా? అంటూ జగన్‌పై మంత్రి మండిపడ్డారు.

జగన్ ఎంత నీచానికి దిగజారాడో చూడండి…

Posted by Saaho Chandrababu on Monday, October 8, 2018

ఇరుకు సందుల్లో సభలు పెట్టడం ఏంటని నిలదీశారు. పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే జగన్‌ ఒక్క మాట మాట్లాడటం లేదని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఇదీ జగన్ , ఆయన అభిమానులు, వైసిపోయి సోషల్ మీడియా విభాగం ఆడిన అంబులెన్స్ నాటకంలో ప్రభుత్వ పాత్ర లేకున్నా కేవలం విమర్శించడం కోసమే ఇలాంటి కుత్సిత విమర్శలు చేస్తున్నారని జగన్ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Facebook Comments