జగన్ కు మరో బిగ్ షాక్ … టీడీపీలో చేరనున్న కీలక నేత

వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి కాకినాడ నేత చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఆ బాధ్యతల నుండి జగన్ ఆయన్ను తొలగించారు. అక్టోబరు రెండో వారంలో చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి చేరుతున్నారని తెలిసింది.

ఎన్నికలు దగ్గరపడుతుండగా.. టీడీపీలోకి వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే.చలమలశెట్టి సునీల్ తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలక నేత. అమరావతి లో చంద్రబాబు ను కలిసిన సునీల్ అక్టోబర్ రెండో వారంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఒకపక్కవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క వైసీపీ నేతలు టీడీపీలో చేరి పార్టీని బలహీనపరుస్తున్నారు.

కాకినాడలో కీలకనేత అయిన సునీల్ 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కొద్దిరోజులుగా సునీల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన జగన్ ప్రజా సంకల్పయాత్రకు కూడా దూరంగా ఉన్నారు. జనసేన, టీడీపీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం జరిగినా.. ఆయన టీడీపీవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సునీల్ అమరావతిలో సీఎం చంద్రబాబుతో ఈ విషయమై భేటీ అయ్యారు. అక్టోబర్ రెండోవారంలో ఆయన సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తుంది.. అయితే దీనిపై ఆయన మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మరో కీలక నేత టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నాడు.

Facebook Comments