బొమ్మిరెడ్డి చూపు టీడీపీ వైపు… వైసీపీపై తిరుగుబాటు

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. వేంకటగిరి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కలలుకన్న బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి కలలు కల్లలయ్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారాన్ని ద‌క్కించుకునేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో అసంతృప్తికి గురైన బొమ్మిరెడ్డి ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు.వైసీపీ అధినేత జగన్ పార్టీకి అండ‌గా ఉన్న , పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తున్న నేత‌ల‌ను కాద‌ని, ఎన్నిక‌ల్లో డ‌బ్బులు వెద‌జ‌ల్లే వారికే జ‌గ‌న్ టికెట్ కేటాయిస్తుండ‌టం వైసీపీ నేత‌ల‌ను అసంతృప్తికి గురి చేస్తుంది.నెల్లూరు జిల్లాలోని వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా నాలుగేళ్లు ప‌నిచేసిన జ‌డ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డిని త‌ప్పించి కొత్త‌గా వైసీపీలో చేరిన ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డిని కొత్త‌ ఇంచార్జ్‌గా నియ‌మించారు జ‌గ‌న్‌. దీంతో వైసీపీ నేత‌లు జ‌గ‌న్‌ తీరుపై మండిప‌డుతున్నారు. ఇత‌ర పార్టీల్లో చేరేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

గ‌తంలో 2014లో వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి ని నియ‌మించిన జ‌గ‌న్‌, టికెట్ కూడా ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. నమ్మి నాఉగేల్లుగా పార్టీ కోసం నియోజకవర్గం లో పట్టు కోసం పని చేసిన బొమ్మి రెడ్డి ని కాదని తాజాగా పార్టీలో చేరిన ఆనం రాం నారాయణ రెడ్డి కి టికెట్ ఇవ్వటంతో మనస్తాపం చెందినా బొమ్మిరెడ్డి పార్టీ కి రాజీనామా చేశారు. ఆనం వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీగా డ‌బ్బు ఖ‌ర్చు పెడ‌టానికి తాను సిద్దం అని చెప్పటంతో ఆనంకే టికెట్ కేటాయిస్తూ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం బొమ్మిరెడ్డి కి ఆవేదన కలిగించింది.

అయితే వైసీపీకి రాజీనామా చేసిన ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌నే దానిపై నెల్లూరు రాజ‌కీయాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న టీడీపీ ఆహ్వానించిన తర్వాత ఆ పార్టీలో చేరే విష‌యంపై ఆలోచిస్తానని స్ప‌ష్టం చేశారు. జడ్పీ ఛైర్మన్‌ పదవి లక్కి డిప్‌ ద్వారా తనకు వచ్చిందని, ఈ పదవి కూడా వైకాపా వారు తీసుకోవాలనుకుంటే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టవ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.మొత్తానికి బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి జగన్ పై తిరుగుబాటు ప్రకటించారు. టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న ఆయన్ను టీడీపీ పార్టీలోకి తీసుకుంటుందో లేదో చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం తెలియనుంది.

Facebook Comments