బ్రేకింగ్: ఆ పార్టీలో చెరపోతున్న కొండా సురేఖ

ఊహించిందే జరిగింది. కొండా దంపతుల యుద్ధం మొదలైంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కానీ ఏ పార్టీలో చేరుతున్నామో మరో రెండు రోజులలో చెప్తామని చెప్పారు. రెండు టికెట్లు అడుగున్న నేపధ్యంలో కాంగ్రెస్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్తున్నా కొండా దంపతులు పార్టీ విషయంలో నిర్ణయం ప్రకటించకుండా తాత్సారం చెయ్యటం వెనుక గల కారణాలు ఏమిటో అన్న ఉత్కంఠ తెలంగాణా రాష్ట్రంలో నెలకొంది.
టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ అలకబూనిన కొండా దంపతులు ఎట్టకేలకు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని.. సీఎం కేసీఆర్ తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కొండా సురేఖ ఆరోపించారు. టీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ అని చెప్పిన ఆమె పార్టీ లో సీనియర్లు ఇమడలేరని చెప్పారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు మంగళవారం ఆమె పార్టీకి తమ రాజీనామా విషయాన్ని ప్రకటించారు.

కేటీఆర్ ను సీఎం చేయాలని అనుకుంటున్న కేసీఆర్.. ఆ ప్రయత్నాల్లో భాగంగా సీనియర్ నాయకులను అణచి వేస్తున్నారని సురేఖ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను కూడా ఆమె విడుదల చేశారు. కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదేనంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్ పాతరేశారని విమర్శించారు. బీసీ మహిళగా తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా కేసీఆర్ తన దొరతనాన్ని చూపించారని ఆరోపించారు. వరంగల్ వచ్చి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేసినప్పుడు కూడా తనను కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపలేదని తెలిపారు. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదని.. అందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్ ను రాజకీయ సన్యాసం తీసుకోటానికి రెడీ అవ్వాలని చెప్పారు.

ఇన్ని విషయాలు చెప్పిన సురేఖ ఏ గూటికి చేరుతున్నారో చెప్పలేదు. టికెట్ల విషయం ఇంకా తేలకపోవటమే కారణంగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ లో సైతం మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో పార్టీని వీడిపోయి తిరిగొచ్చి మళ్ళీ 2 టికెట్లు కావాలంటే ఎలా ఇస్తారు అని కాంగ్రెస్ పార్టీ లో కొండా టికెట్ల వ్యవహారం బాగానే అగ్గి రాజుకుంది.ఈ నేపధ్యంలోనే కొండా దంపతులు ఒక స్పష్టమైన హామీ కోసం వేచి చూస్తున్నారు. ఆ హామీ వస్తే వెంటనే తాము చేరే పార్టీ ప్రకటించేవారు కానీ ఇప్పుడు అక్కడ కూడా కొండా దంపతులకు బోలెడన్ని తలనొప్పులు ఎదురు కావటంతో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు.భూపాలపల్లి లో మాజే చీఫ్ విప్ గండ్ర రమణా రెడ్డి , పరకాలలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాం రెడ్డి ఇలా ఎక్కడకి వెళ్ళాలి అన్నా అక్కడ అవకాశం కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఆశావహులు ఆమె రాకను అడ్డుకుంటున్న నేపధ్యంలో కొండా దంపతులు వేచి చూస్తున్నారు. రెండు టికెట్లు అవకాశం ఇచ్చే జాతీయ పార్టీల వైపు కొండా దంపతులు మొగ్గు చూపుతున్నారు.

Facebook Comments