చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్… మరోసారి కేంద్రం కుట్ర బయటపడింది

కేంద్రం కుట్ర నిజమైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై శివాజీ చెప్పిందే జరిగింది. త్వరలో సీబీఐ నోటీసులు వస్తాయని చెప్పినట్టుగానే నాన్ బెయిలబుల్ వారెంట్ పంపి చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది కేంద్రం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉండగా చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈ వారంట్ జారీ చేసింది.. ఈ నెల 21వ తేదీన చంద్రబాబుతో పాటు మిగతా 16 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు అదేశించింది.

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో వుండగానే తనకు నోటీసులు వచ్చినట్లు చంద్రబాబుకు తెలిసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్నితెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు. ఇది కచ్చితంగా కేంద్రం కుట్రే అని తేల్చి చెప్తున్నారు. ఎన్నికలకు ముందుకెళ్ళకుండా ముందరి కాళ్ళకు బంధాలేసే ప్రయత్నం కేంద్రం చేస్తుంది అనేది ఈ వారెంట్ తో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్ధం అవుతుంది.

Facebook Comments