చంద్రబాబుకు అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించే ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు నాయుడు కి అంతర్జాతీయ గుర్తింపు వుంది. సెప్టెంబర్ 24వ తేదిన న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సదస్సులో చంద్రబాబును ప్రసంగించాలని ఆహ్వానంలో కోరగా చంద్రబాబు ఆ సమావేశానికి వెళ్లనున్నారు.

ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్.. గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై చంద్రబాబు ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించనున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానంతో పాటు సేంద్రియ వ్యవసాయం రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సమితి ప్రశంసించి చంద్ర బాబు ను సదస్సుకు ఆహ్వానించింది.

ఈ నెల చివరివారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొంటున్న చంద్రబాబు అనంతరం వివిధ వ్యాపార వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన ముగించుకుని 27న అమెరికా నుంచి అమరావతికి తిరిగి రానున్నారు.

Facebook Comments