ప్రభుత్వంపై ప్రజల నాడి ఏలా వుందో తేల్చి చేప్పిన చంద్రబాబు

ఏపీలో ఇప్పుడు వున్న  పరీస్థీతులలో ప్రజలు చాలా వ్యతిరేకతతో వున్నారని చంద్రబాబు తేలియచేశాడు.ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న కొత్త ప్రతిపాదనను జగన్ సర్కార్ తెరపైకి తీసుకురావడంతో ప్రస్తుత రాజధాని అమరావతి రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి. అమరావతిని తరలించవద్దంటూ రోడ్లపై రైతులు, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజధాని రైతులకు మద్ధతుగా టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు.అయితే ఈ సందర్భంగా రాజధానిపై చంద్రబాబు తన ఆవేదనను వ్యక్తపరిచారు.

 

మన రాజధాని అమరావతి పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు నన్ను కదిలించాయని, తెదేపా నేతల దీక్షా శిబిరంలో ఒక చెల్లి తన చేతి గాజులిస్తే, మరో చెల్లి ఏకంగా నల్లపూసల గొలుసే ఇచ్చేసిందని అన్నారు. జనవరి 1న నారా భువనేశ్వరి తన చేతి గాజు ఇస్తే, వెటకరించిన వైసిపి వాళ్లు దీనికేమంటారని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతి ఉండాలనేది 13జిల్లాల ప్రజల అభీష్టం. అందుకే టిడిపి 5ఏళ్ల పాలనలో వైసీపీ అధ్యక్షుడితో సహా ఏ ఒక్కరూ దానిని వ్యతిరేకించలేదని, అదే ఇప్పుడీ వైసీపీ ప్రభుత్వ 3రాజధానుల అంశంపై 13 జిల్లాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయంటే ప్రజల్లో వ్యతిరేకతకు ఇంతకంటే రుజువేం కావాలని అన్నారు. ఆ రోజు రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములను త్యాగం చేసిన రైతులకు, ఈరోజు కష్టం వస్తే, యావత్ రాష్ట్రం వెన్నంటి నిలవాల్సిన బాధ్యత ఉందని, ఈ ఆడబిడ్డల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని అన్నారు. అంతేకాదు “సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్” 5కోట్ల ప్రజల రణన్నినాదం కావాలని పిలుపునిచ్చారు.