ఇప్పుడు కోట్టిన దెబ్బతో ఇంకా ఏం చేయలేరు… చంద్రబాబు సంచలనం

శాసనమండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి మూడు రాజధానుల బిల్లు పాక్ కానివ్వకుండా చేయడానికి తమ వద్ద ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శాసనమండలిలో రూల్ 71 మీద చర్చ తర్వాత ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టీడీపీకి అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. మొత్తం 32 మంది టీడీపీ సభ్యులు కాగా, ఒకరు రాజీనామా చేశారు. ఇద్దరు వ్యతిరేకంగా (పోతుల సునీత, శివనాద్ రెడ్డి) ఓటు వేశారు. ఇద్దరు (శమంతకమణి, శత్రుచర్ల) సమావేశానికి గైర్హాజరయ్యారు. మండలిలో రూల్ నెంబర్ 71 విషయంలో తమ పంతం నెగ్గించుకోవడంతో టీడీపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ముచ్చటించారు. ‘ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడి పోయింది.

 

బిల్స్ పై చర్చ కూడా పెట్టకూడదు. బిల్స్ పై వోటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా మాకు మద్దతుగా నిలుస్తారు. ప్రభుత్వం ఈ విషయం లో ఏమి చెయ్యలేదు. మా దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి. నేటి వోటింగ్ లో గెలవని ప్రభుత్వ ప్రతిపాదన… రేపు ఎలా నిలుస్తుంది.’ అని అన్నారు.