బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు సీఎం చంద్రబాబు సవాల్

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుతుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ స‌మావేశాలు వాడీ వేడిగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ లో మాటల యుద్ధం కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ.. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీ టీడీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని బ‌హిష్క‌రించ‌డంతో.. ఇప్పుడు బీజేపీ, టీడీపీ మ‌ధ్య అసెంబ్లీలో మాట‌ల యుద్దం చోటు చేసుకుంటుంది. బీజేపీ, టీడీపీ మ‌ధ్య విమర్శలు, ప్రతి విమ‌ర్శ‌లు, సవాళ్లు , ప్రతి సవాళ్ళతో సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో అసెంబ్లీ లో మాటల యుద్ధం జరుగుతోంది.

ఈ క్ర‌మంలో అసెంబ్లీ స‌మావేశాల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, బీజేపీఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడిన అంశాలపై ఫైర్ అయ్యారు.. విష్ణుకుమార్ రాజు చేసిన విమ‌ర్శ‌ల‌పై అసెంబ్లీలో మాట్లాడిన చంద్ర‌బాబు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డితో తమకు ఏ సంబంధంలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్న వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు .. జగన్ కేసులను కేంద్రం బలహీనపరుస్తుందని చెప్పిన బాబు ఇందుకు సాక్ష్యాలు చూపితే రాజీనామా చేస్తారా? అంటూ విష్ణుకుమార్ రాజును సూటిగా ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ అక్రమ కలయికను నిరూపిస్తా…మీరు రాజీనామా చేస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు చంద్రబాబు సవాల్ విసిరారు.

మోదీ అవినీతిప‌రుల‌కు కొమ్ముకాస్తున్నార‌ని, నేర‌స్తుల‌తో స్నేహం చేస్తున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డిన బాబు అధికారంలో రాగానే అవినీతిపరులను జైల్లో పెట్టిస్తానన్న మోదీ… ఇప్పుడు అదే అవినీతిపరులను వెంటేసుకొని తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ కి ఏపీ పాలనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్న బాబు విసిరిన సవాల్ కు విష్ణుకుమార్ రాజు సైలెంట్ అయ్యారు.

Facebook Comments