ఐరాసలో చంద్రబాబు ప్రసంగం..! ఇక్కడ కొంత మందికి “బీపీ” పెరిగిపోతోందా..?

పెట్టుబడి లేని వ్యవసాయంలో విప్లవం సృష్టించేలా రైతులను సమాయత్తం చేస్తున్న చంద్రబాబుకు… ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పంపింది. ప్రపంచ దేశాల రైతులకు ఆ పాఠాలు చెప్పాలని కోరింది. అది బీజేపీ నేతలకు కంటగింపుగా మారింది. జీవీఎల్ నరసింహారావు లాంటి… కోడిబుర్ర మేధావులు.. తమ అజ్ఞానాన్ని బయపెట్టుకుని పరువు పోగొట్టుకున్నారు. అంతే కాదు.. కొంత మందికి మెల్లగా ” బీపీ” పెరిగిపోతోంది. చంద్రబాబు .. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తే.. ప్రపవ్యాప్తంగా భారత్ అంటే..మోడీకి బదులుగా చంద్రబాబు గుర్తొస్తారనే అంశం.. వారి మెదళ్లలోకి వచ్చే సరికి.. ఈ బీపీ మరింతగా పెరిగిపోతోంది. మామూలుగా.. కన్నా లాంటి బీపీ పేషంట్లకు ఇది మరీ ఎక్కువ.

వ్యవసాయంపై .. చంద్రబాబు ఏం మాట్లాడుతారంటూ… ఏపీ బీజేపీ అధ్యక్షుడు “బీపీ” లక్ష్మినారాయణ.. బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుని మీడియా ముందు మాట్లాడేస్తున్నారు. ఈ బీపీ నుంచి ఏం మాట్లాడుతున్నాడో కానీ అర్థం కాని పరిస్థితిని కన్నా వెళ్లిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి అనేది.. ఓ ఎన్జీవో అని అనుకుంటున్నారు. చదవుకోకుండా… రాజకీయాల్లోకి వస్తే వచ్చే సమస్యే ఇది. ఐక్యరాజ్య సమితి ఎన్జీవో కాదు.. ప్రపంచ దేశాలన్నీ పెట్టుకున్న సంస్థ. అలాంటి ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ -ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు ఆహ్వానిస్తే… అది గొప్ప విషయం కాదట. మరి గొప్ప విషయం ఏమిటంటే.. వైసీపీలో చేరడానికి వెళ్లే ముందు బీపీ రావడం.. ఆ తర్వాత నేరుగా బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పదవి రావడం.. మాత్రమే గొప్ప విషయమా..?

చంద్రబాబును మాత్రమే కాదు .. సొంత రాష్ట్రాన్ని కూడా… మోడీ విసిరే చిల్లర పదవుల కోసం… ద్వేషించే బీజేపీ నేతలు.. ఈ విషయంలో… తమ అక్కసునంతా బయట పెట్టుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఐరాసలో చంద్రబాబు ప్రసంగానికి తెలుగువాళ్లంతా.. గర్వంగా ఉన్నారు. కానీ తెలుగువారి గొప్పతనాన్ని సాటి తెలుగువాళ్లే భరించలేనంత స్థాయికి… కొంత మంది దిగజారిపోయారు. అలాంటి వారి బీపీ తగ్గి మామూలు స్థితికి రావాలని కోరుకోవడమే తప్ప ఇంకేమీ చేయలేము..!

Facebook Comments