చంద్రబాబు వారెంట్ పై కేసీఆర్ స్పందించనిది అందుకేనా..?

నాటి తెలంగాణా టీడీపీ బృందం బాబ్లీ నిర్మాణంపై ఆందోళన చెయ్యటం తెలంగాణా ప్రయోజనాలను కాపాడటం కోసమే… బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికిగానూ చంద్రబాబునాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు సహా మరో 14 మందిని ఈ నెల 21లోగా కోర్టులో హాజరుకావాలంటూ మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అయితే ఈ వారెంట్లు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ శ్రేణులు మండి పడుతున్నారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ఈ వారెంట్ల పై స్పందించాలని కోరుతున్నారు. మరి కేసీఆర్ ఎందుకు స్పందించరో తెలుసా

తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్న సమయంలో గతంలో తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ సైతం ఎన్నికల్లో పోటీలో ఉండాలని మహా కూటమి ఏర్పాటు చేసి కేంద్రానికి సహకరిస్తానని చెప్పి కుట్ర చేస్తున్న కేసీఆర్ కు చెక్ పెట్టాలని భావించింది. అందులో భాగంగా పొత్తులతో పోటీ లో వుండాలని కసరత్తు చేస్తున్న టీడీపీ కి బ్రేక్ వెయ్యటానికి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. 8 సంవత్సరాల క్రితం చేసిన ధర్నాకు ఇప్పుడు వారెంట్ ఇవ్వటం వెనుక తెలంగాణలో కేసీఆర్ కు సహకరిస్తున్న కేంద్రం తీరు స్పష్టంగా కనిపిస్తుంది.

కేంద్రం తో ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదని చెప్తున్నా కేసీఆర్ తెలంగాణా కోసం జరిగిన ధర్నా లో ఇప్పుడు వారెంట్ ఇవ్వటంపై తన స్పందన తెలియజెయ్యాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. టీఆర్ఎస్ కు మహా కూటమితో ప్రతికూల వాతావరణం ఉన్న నేపధ్యంలో కూటమి శ్రేణులను బలహీనపరిచే కుట్ర అని టీడీపీ భావిస్తుంది. ఒకవేళ ఈ వారెంట్ విషయంలో తన ప్రమేయమే లేకపోతే కేసీఆర్ ఈ విషయంలో చిత్త శుద్ధి తో స్పందించాల్సి వుంది. కానీ కేసీఆర్ స్పందించరు ఎందుకంటే అంతా కేసీఆర్ కు తెలుసు. కేంద్రం కనుసన్నలలోనే కేసీఆర్ ఉంటున్నారనేది నమ్మలేని నిజం. కేంద్రం తరహాలో రాష్ట్రంలో కేసుల కలకలం సృష్టిస్తున్న కేసీఆర్ కూడా కేంద్రం తానులోని ముక్కే కావటంతో ఏపీ సీఎం చంద్రబాబు వారెంట్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

Facebook Comments