షాకింగ్: చంద్రబాబు నిర్ణయం భేష్… బీజేపీ నేత ప్రశంస

సీఎం చంద్రబాబు పై నిత్యం విమర్శలు గుప్పించే బీజేపీ నాయకులు సీఎం ను శభాష్ అన్నారు. టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు చంద్ర బాబుపై ప్రశంసలు గుప్పించారు. సీఎం నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు. నిజమా అని ఆలోచనలో పడ్డారా ? అయితే ఈవార్త చదివెయ్యండి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ పాల్గోవటం లేదు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపే టీడీపీ ప్రభుత్వం పై నిప్పులు చేరుగుతుంది. అవినీతి మయంగా పాలన వుందని ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసెంబ్లీ లో వాడీ వేడి చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ సీఎం ప్రకటించిన నిర్ణయం బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు తో శభాష్ అనిపించింది.

రాష్ట్రంలో సామాన్యులపై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు చొరవ తీసుకున్నారు. వ్యాట్ ను 2 రూపాయలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ లో ప్రకటించారు. ఇక బీజేపీ నాయకులను ‘‘కేంద్రానికి పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించే మనస్సు లేదా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్రానికి కనిపించడం లేదా? పెట్రోల్ ధర పెరగటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే మీరు ఆనందంగా ఉన్నారు. కేంద్రం ప్రజలను మభ్యపెడుతోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును లీటర్‌కు రూ.2 తగ్గిస్తూ అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు.

మంగళవారం నుంచి తగ్గింపు ధరలు అమలులోకి రానున్నాయి. పన్నులు తగ్గించడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1120 కోట్ల ఆర్ధిక భారం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని విష్ణుకుమార్‌రాజు స్వాగతించారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని విష్ణుకుమార్‌రాజు కోరారు. పన్ను తగ్గింపుపై సీఎం నిర్ణయాన్ని అభినందిస్తున్నానని సభాముఖంగా చెప్పారు.

Facebook Comments