ప్రపంచ స్థాయి అవార్డు వెతుక్కుంటూ… చంద్రబాబు మరో ఘనత

పని చేసేవారికి పదవులు… పురస్కారాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న తపనకు మరో అంతర్జాతీయ పురస్కారం వెతుక్కుంటూ వచ్చింది. వ్యవసాయ రంగాయానికి చంద్రబాబు ఇస్తున్న ప్రోత్సాహానికి గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఏపీ ముఖ్యమంత్రిని పిలిపించి తన వేదికపై నుంచి ఆయన అభిప్రాయాలను ప్రపంచానికి వినిపించే అవకాశం కల్పించింది. ఇక చంద్రబాబు తన అధికార పర్యటనల్లో ఏ దేశానికి వెళ్లినా… ఏ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు హాజరైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయనే అవుతారు. భారత ప్రధాని పదవికి ఎంతటి గుర్తింపు ఉందొ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి అంతటి గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో తెచ్చిన నేత చంద్రబాబు. ఈ విషయం చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇదే విషయం మరోసారి రుజువైంది.

రైతు సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న చంద్రబాబు శ్రమకు మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన 11వ గ్లోబ ల్‌ అగ్రికల్చరల్‌ లీడర్‌షిప్‌ అవార్డు-2018 చంద్రబాబుకు దక్కింది. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన నియమించిన జ్యూరీ కమిటీ ఈ అవార్డును ఎంపిక చేసింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఐసీఎ్‌ఫఏ) సంస్థ ఈ మేరకు సీఎంకి ఈ-మెయిల్‌ పంపింది. గ్రామీణ ప్రాం తాల్లో రైతుల సంక్షేమం కోసం, సాధికారత కోసం కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు ఈ సంస్థ ఏటా పురస్కారాలు అందిస్తోంది.ప్రతి సంవత్సరం విధానం, పరిశ్రమ, పరిశోధన, సాగు, అభివృద్ధి నాయకత్వం, ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం, జీవనకాల సాఫల్యం తదితర 15 రకాల కేటగిరీల్లో ఈ అవార్డులను అందిస్తారు. జాతీయ అవార్డు కమిటీ ఢిల్లీలో గత నెల 15 న సమావేశమై చంద్రబాబును పాలసీ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగంలో ప్రగతి సాధించి.. పల్లెల సౌభాగ్యానికి కృషి చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం విజన్‌తో నాయకత్వం వహించినందుకు ఈ అవార్డు ఇవ్వనున్న ట్లు ఐసీఎ్‌ఫఏ సీఎంకు పంపిన మెయిల్‌లో పేర్కొం ది.

2015లో ఈ అవార్డుకు అప్పటి ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, 2016లో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, 2017లో హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ప్రదానం చేశారు. 2018లో చంద్రబాబు అందుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ సాయం త్రం ఢిల్లీలోని హోటల్‌ హయత్‌ రీజెన్సీలో నిర్వహిం చే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రదా నం చేస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఇద్దరు గవర్నర్లు, ఇతర ప్రముఖులు హాజరవుతారని కేంద్ర అధికారులు తెలిపారు. ఈ అందరి సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకొనున్నారు.

Facebook Comments