చేసిందంతా చేసి గింజుకుంటున్న బీజేపీ నేతలు…!

అనుకున్నదొక్కటి అయినది ఇంకొక్కటి అంటూనిర్వేదం పలుకుతున్నారు తెలుగు బీజేపీ నేతలు. తామోకటి తలచి చంద్రబాబుకు అరెస్ట్ వారెంటు పంపిస్తే… చంద్రబాబు దాన్ని తిప్పి కొట్టడంతో కమలనాథులు గిలగిలా కొట్టుకుంటున్నారు. అరెస్ట్ వారెంటు ఇప్పించి చంద్రబాబుని భయపెట్టాలని చూస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీకే చుట్టుకోవడంతో దాన్నించి ఎలా బయట పడాలో తెలియక తికమక మకతిక పడుతున్నారు అరెస్ట్ వారెంటు జారిపై బీజేపీ నేతలు ఆనందం క్షణకాలం కూడా నిలవలేదు. దీనికి కారణం వారెంటు జారీ అయింది అని తెలియగానే తెలుగు ప్రజలందరూ ఇది బీజేపీ కుట్రే అని తేల్చేశారు. మోడీ మాట విననందుకే చంద్రబాబుని ఇలా వేధిస్తున్నారని కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆంధ్రా ప్రజలంతా.

ఈ పరిణామాన్ని బీజేపీ నేతలు వుహించలేకపోయారు. అసలే రాష్ట్రానికి చేసిన అన్యాయంపై బీజేపీ మీద ప్రజలంతా మండి పడుతున్నారు. మాట ఇచ్చి మోసం చేసిన… నష్టాన్ని పూడ్చకుండా వంచించిన బీజేపీకి బుద్ది చెప్పాలని కాచుకుని వున్నారు. ఇలాంయి తరుణంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు చంద్రబాబు మీద పాట కేసులు తిరగతోడి అరెస్ట్ వారెంటు ఇప్పించడంతో తెలుగు ప్రజల ఆగ్రహం నషాలనికి అంటింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ద్వేషంతోనే మోడీ ఇదంతా చేసారని జనం అర్ధం చేసుకున్నారు. టీడీపీ నేతలు స్పందించకముందే జనమే బీజేపీ తీరును ఎండగడుతూ బయటకు వచ్చారు. అప్పటికి గాని బీజేపీ నేతలకు తత్వం బోధపడలేదు. చంద్రబాబుకు అరెస్ట్ వారెంటు ఇప్పించి తామెంత తప్పు చేసింది అవగతం కాలేదు. చంద్రబాబు ని ముట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది తేటతెల్లం కాలేదు. రాష్ట్రానికి న్యాయం చేయండని అడుగుతున్నందుకే చంద్రబాబుని తాగేట్ చేసారని జనం ఒక నిశ్చితాభిప్రాయనికి రావడంతో ఏమి చేయాలి అని బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారు. అంతే ప్లేటు ఫిరాయించేశారు. అసలు ఈ అరెస్ట్ వారెంటుకు మాకు సంబంధం ఏమిటని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయితే మహారాష్ట్రలో ఉన్నది బీజాయ్ ప్రభుత్వమేనని మాకెమి సంబంధం లేదని నెత్తీ నోరూ బాదుకున్నా జనం నమ్మే ఛాన్స్ లేదని బీజేపీ నేతలు అర్ధం చేసుకోలేక పోతున్నారు.

అందుకే అరెస్టు వారెంటుతో మాకెమిటి సంబంధం అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ వ్యవహారంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 2010 నాటి కేసులో బీజేపీపై ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలని సూచించారు. ఏం జరిగినా టీడీపీ నేతలు.. కేంద్రానికి ఆపాదిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి నిధుల కేటాయింపులో అన్యాయం జరగడం లేదని, అయితే సాంకేతిక అంశాలతో కొంత జాప్యం జరిగి ఉండవచ్చునని పురంధేశ్వరి పాత పాటే పాడారు.

Facebook Comments