సీయం జగన్ కు చుక్కలు చూపించిన నారా లోకేష్..

రాజధాని మార్పు పై  అమరావతి వాసులకు అండగా టీడీపీ పోరాటం చేస్తునే వుంది. దినిపై ప్రజలకు అండగా వాళ్ళ ధైర్యం కోల్పోకుండా వాళ్ళకు అండగా నిలబడుతునే ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకిస్తుంది.ప్రజల కష్టాలను బాధలను పట్టించుకోకుండా తాను చెప్పిందే వేదం అన్నట్లుగా జగన్ ఏపీలో తుగ్లక్ పాలన చేస్తున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పనిచేశారని కానీ ఆయనను రిలయన్స్ సంస్థకు చంద్రబాబు బినామీ అని ఆరోపణలు చేశారని, విశాఖ నుంచి లూలు కంపెనీ వెనక్కి పంపించారు అని మండిపడ్డారు.

 

మూడు రాజధానులు కాదు మూడు ముక్కల రాజధాని అంటూ జగన్ ను ఉద్దేశించి లోకేష్ ఘాటుగా విమర్శలు చేశారు.ప్రజలు, రైతులు ఎంతో బాధతో రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని ఆందోళన చేస్తుంటే, వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానిస్తారా అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.జగన్ బంగారం, డబ్బు తింటున్నారా లేక రైతు పండించిన అన్నం తింటున్నారా అనే విషయాన్ని చెప్పాలని నిలదీశారు.ఎన్నికల ముందు రావాలి జగన్ కావాలి జగన్ అన్నారని ఇప్పుడు పోవాలి జగన్ మాకొద్దు జగన్ అంటున్నారని లోకేష్ విమర్శించారు.