ఎపీ ప్రభుత్వానికి కెంద్రం బిగ్ షాక్

ఎపీ ప్రభుత్వానికి కెంద్రం మరో షాకి ఇచ్చింది.  విధ్యత పై కెంద్రం ఇచ్చిన షాక్ కి ఇక్కడ అధికారులందరు బిత్తరపోయారు. విధ్యత్త బకాయిలను కట్టకుండ నిర్లక్ష్యం చేశారంటు  వారిపై కోరడా జులిపించారు. వాడుకున్న రోజులన్ని కరెంట్ వాడుకున్నారు. ఇప్పుడు ఎం లెకుందా విద్యుత్త్ ఒప్పందలాపై కెమ్ద్రం బిగ్ షాక్ ఇచ్చింది. విద్యుత్ రంగం విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం అత్యంత కఠిన వైఖరి కనబరుస్తోంది. సోలార్, విండ్ పవర్ విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే అసలు ఏపీకి కరెంట్ దక్కనివ్వబోమన్న అర్థంలో లేఖలు రాస్తోంది. ఇప్పటికే కరెంట్ కొరతతో సతమతమవుతున్న ఏపీకి ఇప్పుడు కేంద్రం.. మరో ఘాటు లేఖ పంపింది. సోలార్, పవన విద్యుత్ సంస్థల బకాయిలన్నింటినీ చెల్లించడమే కాకుండా.. వాటికి కూడా.. ఇక నుంచి “లెటర్ ఆఫ్ క్రెడిట్” ఇవ్వాలని తాఖీదు రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. గతంలో కరెంట్ వాడేసుకుని .. ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించేవి. ఇవి వేల కోట్లు పేరుకుపోవడంతో.. ప్రభుత్వం ముందస్తు చెల్లింపుల వ్యవస్థను లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో తీసుకు వచ్చింది.

దీని ప్రకారం.. విద్యుత్ ఒప్పందాలున్న సంస్థలన్నింటికీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కరెంట‌్ సరఫరా ఆగిపోతుంది. ప్రస్తుతం సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఏపీ సర్కార్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం లేదు. పాత బకాయిలు చెల్లించడం లేదు. దీనిపై ఏపీ సర్కార్ తీరు ఎగ్గొట్టే రీతిలో ఉండటంతో… కేంద్రం… మొహమాటలకు పోకుండా.. లేఖ పంపింది. పదహారో తేదీలోగా… ఆయా సంస్థల బకాయిలు చెల్లించి.. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వకపోతే.. విద్యుత్ ఎక్సేంజీ నుంచి కరెంట్ కొనకుండా బ్లాక్ చేస్తామని హెచ్చరికలు పంపింది. ఇప్పటికే ఓ సారి అలా బ్లాక్ చేయడంతో.. ఉన్న పళంగా డబ్బులు కట్టి…ఎలాగోలా.. కొనుగోలుకు అవకాశం కల్పించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిని కేంద్రం తీసుకు వస్తోంది. విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పదో తేదీన కేంద్ర విద్యుత్ మంత్రికి కాస్త ఘాటుగా ఓ లేఖ రాశారు. తమకు… పవన, సౌర విద్యుత్ భారం అవుతుందని… ఆ భారాన్ని మీరే మోయాలన్నట్లుగా ఆ లేఖ ఉంది. ఓ వైపు.. ధర్మాల్ విద్యుత్‌న యూనిట్‌ను రూ. 12కి కొంటూ.. రూ. 4కి వచ్చే సౌర, పవన విద్యుత్ భారం అవుతుందంటూ లేఖ రాయడంపై కేంద్రం తీవ్ర అసహనానికి గురయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇక ఏపీ సర్కార్ తో మొహమాటలేమీ పెట్టుకోకుండా డీల్ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కోతలతో అల్లాడిపోతున్న ఏపీ సర్కార్ కు… పదహారో తేదీ తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. కేంద్రం చెప్పినట్లుగా.. విద్యుత్ సంస్థలకు నిధులివ్వడానికి ఏపీ సర్కార్ వద్ద డబ్బుల్లేవు మరి..!

Facebook Comments