కాంగ్రెస్ కొంప ముంచుతుందా..? కొండా సురేఖ సీరియస్ వెనుక అసలు కథ ఇదే..?

కాంగ్రెస్ పార్టీ లో చేరినా కొండా సురేఖ సంతోషంగా లేరు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంతో గుర్రుగా ఉన్నారు కొండా దంపతులు. టీఆర్ఎస్ లో రెండు టికెట్ల వివాదమే కొండా పార్టీ మారటానికి కారణమని చెప్పుకున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముందు కూడా కొండా దంపతులు రెండు టికెట్ల ప్రతిపాదన పెట్టారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఒకే కుటుంబం నుండి ఒకే టికెట్ అని ప్రకటించి పార్టీ నుండి వేరే అశావహులకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ముదావహమే అయినా అందులో కొంత సడలింపు కూడా ఇవ్వటమే కొండా దంపతులు గుర్రుగా ఉండటానికి కారణం.

కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరికైనా సరే కుటుంబానికి ఒక్కరికే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ఆదిస్థానం. అందులో గత ఎన్నికల్లో ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చిన వారికి మినహాయింపు నిచ్చింది. అలా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి కి, ఆయన భార్య కు గతంలో రెండు టికెట్లిస్తే రెండు సీట్లు గెలిచారు. ఈ సారి కూడా వారికి ఇద్దరికీ అవకాశం రానుంది. దీంతో ఇద్దరు ఎన్నికల బరిలో నిలిచే వకాశం కనిపిస్తుంది.

తమకు కూడా 2014 ఎన్నికల్లో అవకాశం ఇచ్చి వుంటే గెలిచి చూపించేవారిమని అనవసరంగా ఇబ్బంది పెడితే టీఆర్ఎస్ పార్టీలో నాలుగు సీట్లు గెలిపించామని చెప్తున్నారు కొండా దంపతులు. ఇప్పటికైనా తమకు రెండు టికెట్లిస్తే 5 స్థానాలు గెలిచి పార్టీ అధిష్టానానికి బహుమానంగా ఇస్తామని చెప్తున్నారు. ఉత్తమ్ కు అవకాశం ఇచ్చినట్టే తన కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్న కొండా దంపతులు రెండోటికెట్ విషయం తేల్చకపోవటంతో గుర్రుగా ఉన్నారు.

Facebook Comments