జగన్ పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు

ఇటీవల ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి పిల్లాడి చదువుకు తాను సాయం చేస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.ప్రతి ఇంట్లోని పిల్లాడికి అమ్మాయికి తాను మేనమామను అయ్యి వారిని చదివిస్తాను అంటూ జగన్‌ చెప్పాడు.పిల్లల చదువుకు అమ్మఒడి తీసుకు వచ్చిన జగన్‌ ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న విషయం తెల్సిందే.ఈ పథకంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు తులసి రెడ్డి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.ఇతర సంక్షేమ పథకాల నిధులు అన్ని తీసుకు వచ్చి ఇక్కడ ఇస్తున్నావు.జనాలు నిన్ను నమ్మడం మానేశారు.

 

నీవు పిల్లలకు మేనమావవు కాకున్నా పర్వాలేదు కాని వారి పట్ల శకుని మాత్రం అవ్వొద్దని కోరుకుంటున్నాను అన్నాడు.నీకు ఇంగ్లీష్‌పై అంత మమకారం ఉంటే నీ సాక్షి పేపర్‌ను ఇంగ్లీష్‌లో వేయిస్తావా అంటూ ప్రశ్నించాడు.