కాంగ్రేస్ ఎమ్మెల్యే షాకింగ్ ప్రకటన, కాంగ్రేస్ ఇక బయటపడటం కష్టమేనా..?

తెలంగాణాలో కాంగ్రేస్  ఇప్పుడు ఎలాంటి పరీస్థీతులలో వుందో మనందరికి తేలిసిన విషయమే. ఒకప్పుడు కళకళలాడిన కాంగ్రేస్ ఇప్పుడు చాలా దయనీయ పరీస్థీతులలో వుంది.  మరీ ముఖ్యంగా నాయకులు వున్నారు, అలాగే క్యాడర్ వుంది. కానీ  ఇక్కడ నాయకులను ఒక చోట చేర్చి  గెలిపించె నాయకుడు కరువయ్యారు. ప్రస్తుతం ఇంకా ఇప్పుడు అలాంటి నాయకులు ఒకరో ఇద్దరో కాంగ్రేస్ లో వున్నారు. కానీ వాళ్ళకి మాత్రం నాయకత్వ  భాధ్యతలు ఇచ్చేలా కనిపించడం లేదు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్న విషయం తెల్సిందే.ఆయన్ను తొలగించే అవకాశం ఉంది.గత ఏడాదే ఆయన పదవి పోవాల్సి ఉంది.కాని వరుసగా ఏవో ఎన్నికలు వస్తున్న కారణంగా ఆయన్ను కొనసాగిస్తూ వస్తున్నారు.

 

త్వరలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక దాదాపుగా ఖాయం అయ్యింది.ఉత్తమ్‌ స్థానంలో ఎవరిని తీసుకు వస్తారు అంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్‌లో ఎవరికి ఏ పదవి వస్తుందో ఎప్పుడు చెప్పలేం.అధిష్టానం వద్ద ఎవరు బలం నిరూపించుకుంటే వారే చీప్‌ అవ్వొచ్చు.ఇప్పుడే అదే పనిని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేస్తున్నాడట.తనకున్న బలంను తాను గతంలో చేసిన పనులను మరియు తాను ప్రభుత్వం చేస్తున్న పోరాటంను, ప్రజా క్షేత్రంలో తనకు ఉన్న బలంను చూపించుకుంటూ తనకు పీసీసీ పదవి ఇవ్వమంటూ అక్కడ పైరవీలు చేస్తున్నారట.తాజాగా ఈవిషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు.హస్తినలో సీరియస్‌గా టీపీసీసీ పదవి కోసం ప్రయత్నిస్తున్నాను అన్నాడు.పార్టీని బలపర్చేందుకు తాను ఏం చేస్తానో వివరించి చెబుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.