జగన్‌కు ముందస్తు ఎన్నికల ఫీవర్ వచ్చిందా..? ఎన్నికలు ఎప్పుడో మోడీ చెప్పారా..?

వైఎస్ జగన్మోహన్ అంటే… హింసించే పులకేసి 35వ రాజు లాంటి వాడు.. ఆయనకు నిద్రలో ఏది అనిపిస్తే.. అది చేసేయడానికి వెనుకాడరు. తాజాగా అలాంటిదే నిన్న ఒకటి జరిగింది. ఆయన రెండు రోజుల కిందట.. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలొస్తాయని కలొచ్చింది. వెంటనే పార్టీ నేతలు..అంటే నియోజకవర్గ ఇన్చార్జులు.. పార్లమెంట్ ఇన్చార్జులు… అందర్నీ హడావుడిగా సమావేశానికి పిలిచారు. వైజాగ్‌కు రప్పించారు. అందరికీ ఈ విషయం చెప్పారు. నాలుగైదు నెలల్లో ముందస్తుకు వస్తాయి.. అందరూ రెడీ కమ్మని ఆదేశించారు. జగన్ మాటలు విని అందరూ ఊసురుమన్నారు. పిచ్చి పీక్స్‌కి చేరితే పరిస్థితి ఇలాగే ఉంటుందని.. నేతలందరూ తలలు పట్టుకున్నారు.

వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఉన్న ఏపీలో జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎనిమిది నెలల సమయం ఉంది. మూడు నెలల ముందుగా ఎవరైనా ప్రత్యేకంగా ఎన్నికలకు వెళ్తారా..? ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. అలాంటి ప్రయత్నం చేస్తాడా..? .బుద్ది ఉన్న రాజకీయ నేత ఎవరూ చేయరు. అలా ఆలోచించలేరు కూడా.. ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు వస్తూంటాయి. దాన్ని పంచుకోవడానికి పార్టీ నేతలందర్నీ విశాఖ టెంట్‌కు పిలిపించి… చెబుతూంటారు. అలానే నిన్న కూడా పిలిచి చెప్పారు. కానీ అందులో మ్యాటర్ లేక తుస్సుమన్నంది. కాస్తంత అయినా రాజకీయ విజ్ఞానం ఉంటే… ఈ పరిస్థితి రాదని… వారు తలలు పట్టుకుంటున్నారు.

జగన్‌కు అలా చెప్పడం అలావాటేనని.. వైసీపీలో పండిపోయిన మరికొంత మంది నేతలు చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా గతంలో జగన్ చేసిన ప్రకటలను ఉదహరిస్తున్నారు. నాలుగేళ్ల కిందటి నుంచి.. ఇంకా రెండేళ్లలో ఎన్నికలొస్తాయని.. మరో ఏడాదిలో సీఎం అవుతానని పదే పదే ప్రకటించుకునేవారని గుర్తు చేస్తున్నారు. నాలుగేళ్ల సమయం ఉన్నా.. రెండేళ్లే అని చెప్పుకునేవారని.. ఇప్పుడు తొమ్మిది నెలల సమయం ఉన్నా..ఆ తరహాలోనే మూడు నాలుగు నెలలు తగ్గించుకుని చెబుతున్నారని అంటున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఏమిటో.. జగన్‌ను చూస్తే తెలుస్తుందంటున్నారు.. వైసీపీ నేతలు.

Facebook Comments