భూమా అఖిలప్రియ దంపతులు ఏం చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఎక్కడైనా పెళ్ళైన కొత్త జంట ఎక్కడో హనీమూన్ లో హాయిగా గడుపుతారు. కానీ ఈ జంట ఏం చేశారో తెలుసా.. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ తన భర్త తో కలిసి అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేశారు. అదేంటంటే పొలాల్లో దిగి నాట్లు వేసి సందడి చేసిందీ కొత్త జంట.వంగి వరినాటు వేసి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి పక్కన నిల్చొన్న వారు నవ్వూతూ కనిపిస్తున్నాడు.

ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారట. వారే నండి ఇటీవల వివాహం చేసుకుని ఒక్కటైన ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడు అని చెప్పుకున్నారు ఆ గ్రామస్తులు. ఈ నవదంపతులు నాట్లు వేయడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామం గుండా ఈ నూతన జంట వెళ్తుండగా అక్కడ పాములేని అనే రైతు పొలంలో కూలీలు వరినాట్లు వేస్తూ కనిపించారు. దాన్ని గమనించిన మంత్రి అఖిల ప్రియ ఉత్సాహంగా కారు దిగి భర్తను కూడా తనతో పాటూ పొలంలోకి తీసుకెళ్లింది. కాసేపు వరినాట్లు వేసి తన ముచ్చటను తీర్చుకుంది. అనంతరం కాసేపు కూలీలీతో సరదాగా ముచ్చటించింది. ఎకరాకు ఎంత కూలీ ఇస్తున్నారు అని ఆరా తీశారు. కొత్త దంపతులు తమతో కలిసి పనిచేయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అఖిల ప్రియ తెలిపారు. మొత్తానికి మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి చేసుకున్నా ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. భర్తను సైతం తన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

Facebook Comments