నారా లోకేష్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.!

అమరావతిలో  ఏలాంటి పరీస్థీతులు వున్నాయో అందరికి తేలిసిన విషయమే. ఇక అమరావతి ప్రాంతంలో నారా లోకేష్ ప్రజలకు అండగా వుంటు వస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మీడియా ముందు మాట్లాడలేడని, ఆయనకు మాట్లాడడం రాదని ట్విట్టర్ పిట్ట అంటూ హేళన చేసిన వారంతా నేడు లోకేశ్ ప్రసంగానికి, ప్రవర్తనకు ముగ్ధులైపోయారు. అంతేకాదు ఆవేశంలో కూడా ఆయనకున్న ఎమోషనల్ ఫీలింగ్స్‌ని చూసిన వారంతా నిజమైన నాయకుడంటే ఇలానే ఉండాలన్న స్థాయికి లోకేశ్ ఎదిగారు.అదేలా అని అనుకుంటున్నారు కదా నేడు రాజధాని అంశంపై మీడియాతో మాట్లాడుతున్న నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 

అయితే ఇంతలో పక్కనే ఉన్న మసీదు నుంచి ముస్లిం సోదరుల అజాన్ ప్రార్థన వినిపించింది. అయితే అప్పటి వరకు ఆవేశంగా మాట్లాడుతున్న నారా లోకేశ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఒక్క నిమిషం ప్రార్థన అవుతుంది అంటూ మీడియాకి చెప్పారు. అయితే ప్రార్ధన ముగిశాక తిరిగి లోకేశ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఆవేశంగా మాట్లాడుతున్న లోకేశ్ ఒక్కసారిగా సైలెంట్ అయి ప్రార్ధన అయిపోయాక ప్రసంగాన్ని కంటిన్యూ చేయడంతో ప్రజలందరి మత విశ్వాసాల్ని మనోభావాల్ని గౌరవించినవాడే అసలైన నాయకులు అంటూ లోకేశ్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.