హరీష్ మాటల మాయలు ఇంకెంతకాలం..! టీడీపీ కింద పనిచేస్తావా..?

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావుకు.. మామ ఇస్తున్న షాకులు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నారు. ఏ ఫోన్ ట్యాపింగ్ లోనే అడ్డంగా దొరికిపోవడంతో.. ఇప్పుడు .. తన నిజాయితీని నిరూపించందుకు టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై అడ్డగోలు ఆరోపణలు ప్రారంభించారు. కనీసం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లోకి పర్మిషన్ లేని హరీష్ రావు…. శాసనసభాపక్ష సమావేశలో ప్రెస్ మీట్ పెట్టి..ముతక ప్రశ్నలతో ఓ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా కాంగ్రెస్‌ పార్టీ పొత్తులు పెట్టుకుంటోందట. అదేతో.. కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతారన్నట్లు తన అతి తెలివిని మొత్తం రంగరించి లేఖ రాశారు.

చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని.. తెలంగాణ పక్షం ఆయనెప్పుడూ ఉండరన్నది జగమెరిగిన సత్యమన్నారు. కృష్ణా జలాల పంపకం అంశంలో చంద్రబాబు ఏ పక్షం నిలబడతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు షరతులతో కూడినదా? భేషరతుగా పెట్టుకుంటున్నదా? అన్ని స్పష్టత ఇవ్వాలట. 2009లో తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి వాస్తవమేనని.. అయితే అది షరతులతో కూడుకున్నదట. తాను చేస్తే సంసారమని చెప్పుకోవడంలో ఆయనను మించిన వారులేరు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క రికి మంచి చేయని వాళ్లు తెలంగాణ ద్రోహులా..? లేక.. ఇలా ఎప్పటికప్పుడు.. పక్కోళ్లని బూచిగా చూపించి రాజకీయం చేసి ఓట్లుపొంది… పబ్బం గడుపుకుందామనుకనేవాళ్లు తెలంగాణ ద్రోహులా..?

తనకు మించిన పుడింగి లేడనుకునే ఈ పెద్ద మనిషి గతంలో తెలుగుదేశం పార్టీ.. తెలంగాణ కు అనుకూలంగా లేఖ ఇస్తే. టీడీపీ ఆఫీసు దగ్గర వాచ్ మన్ గా పని చేస్తానని. టీ , కాఫీలు అందిస్తానని… కార్లు తుడుస్తానని సొల్లు కబుర్లు చెప్పారు. లేఖ ఇచ్చిన తర్వాత కనబడకుండా పోయారు. ఈ పెద్ద మనిషి.. ఇప్పుడు .. మళ్లీ బయటకు వచ్చారు. మామ రాజకీయభవిష్యత్ ను పూడ్చి పెడుతంటే.. ఎలా నిలుపుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు. లేఖలు రాసి టైం పాస్ చేస్తున్నారు.

Facebook Comments