హరిష్ రావు సైలెన్స్ వెనుక అసలు కధ ఇదేనా..??

ఇటీవల జరిగిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.కాంగ్రెస్‌ క్యాండిడేట్‌ ఉత్తమ్‌ పద్మావతిపై ఏకంగా 43 వేలకు పైగా ఓట్ల మెజార్టీని సొంతం చేసుకుని శానంపూడి సైదిరెడ్డి విజయం సొంతం చేసుకున్నాడు.టీఆర్‌ఎస్‌ విజయంపై ఇప్పటి వరకు పలువురు ఆ పార్టీ నాయకులు స్పందించారు.కాని మంత్రి హరీష్‌ రావు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయమై స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది.

హుజుర్‌ నగర్‌ ఎన్నికల విషయంలోనే కాకుండా ఈ మద్య కాలంలో హరీష్‌ రావు చాలా సైలెంట్‌గా ఉంటున్నాడనే టాక్‌ వస్తుంది.హరీష్‌ రావుతో పాటు మంత్రి ఈటెల కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో పార్టీకి వారు మెల్ల మెల్లగా దూరం అవుతున్నారా అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి.అయితే హరీష్‌ రావు మంత్రిగా బిజీగా ఉండటం వల్ల హుజూర్‌ నగర్‌ ఎన్నికల్లో పోటీ చేయలేదని, అంతకు మించి మరే కారణం లేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు.