మహాకూటమి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి ఆయనే

తెలంగాణలో ఎలాగైనా కేసిఆర్ పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో మహా కూటమి అడుగులు వేస్తున్నది. ప్రజా వ్యతిరేక, కుటుంబ పాలన, నియంత పాలన చేస్తున్న కేసిఆర్ ఫ్యామిలీని దింపడమే మహా కూటమి లక్ష్యంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మహా కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ఏ పాత్ర పోశషిస్తారన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి.కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్ రమణ ఉపముఖ్యమంత్రి కావడం ఖాయం అని టిడిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. కూటమిలో తమకు ఒక ఉప ముఖ్యమంత్రితోపాటు మరో రెండు మంత్రి పదవులు దక్కవచ్చని టిడిపి నేతలు ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి రమణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏం కథ అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రమణ గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి జీవన్ రెడ్డి మీద ఓడిపోయారు. ఆయన ఇప్పటి వరకు జగిత్యాలలోనే పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి మహా కూటమి కావడంతో రమణ జగిత్యాల సీటును సిట్టింగ్ అయిన జీవన్ రెడ్డికే వదిలేశారు. తాను జగిత్యాలలో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే కోరుట్లలో రమణ పోటీ చేసే చాన్స్ ఉందని చెబుతున్నారు. కోరుట్ల ప్రస్తుత సిట్టింగ్ టిఆర్ఎస్ ది. ఇప్పుడున్న టిఆర్ఎస్ సిట్టింగ్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకే టిఆర్ఎస్ మల్లా టికెట్ కేటాయించింది. అయితే ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని టిడిపి అంచనాల్లో ఉంది. అందుకే రమణ ను కోరుట్లలో పోటీకి దించడం ద్వారా అటు జగిత్యాల, ఇటు కోరుట్ల రెండు సీట్లలో కూటమి గెలుపు ఖాయమని టిడిపి భావిస్తోంది. రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడిగా చెలామణి అవుతున్నారు రమణ. ఆయన కోరుట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ లోని అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తాయన్న ధీమాతో ఉన్నారు. లేకుంటే సేటిలర్స్ ఎక్కువ వున్న హైదరాబాద్ లో శేరిలింగంపల్లి నుండి బరిలోకి దిగితే రమణ గెలిచే అవకాశం వుందని భావిస్తున్నారు.

కూటమిలో సీటు ఇచ్చే అవకాశం రామనకు రాకున్నా వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తే రమణ ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రి కావటం ఖాయం అని చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కేసిఆర్ కేబినెట్ లో ఉన్న ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ఎమ్మెల్సీలే కదా అంటున్నారు. కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఇద్దరూ ఎమ్మెల్సీలే. గతంలో స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన తాటికొండ రాజయ్య తొలుత ఉపముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆయన్ను అవమానకర రీతిలో తొలగించి కడియం శ్రీహరికి పట్టం కట్టారు కేసీఆర్. కానీ కేసీఆర్ క్యాబినెట్ లో బీసీలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. మంత్రి వర్గంలో బిసిలకు సముచిత స్థానం లేదని, కేబినెట్ నిండా కేసిఆర్ కుటుంబసభ్యులు, రెడ్లే ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు. కానీ కూటమి అధికారంలోకి వస్తే బీసిలకు న్యాయం జరిగే అవకాశం వుంది. అందుకే రమణ కు ఆ పదవి దక్కుతుంది అని అంచనా వేస్తున్నారు మహాకూటమి శ్రేణులు.

Facebook Comments