జగన్ ప్రభుత్వానికి, హైకోర్ట్ నోటిసులు…

రాజధాని తరలింపుపై హైకోర్టుపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు… విజిలెన్స్ ఆఫీస్, జీఏడీ ఆఫీసు తరలింపుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజిలెన్స్ ఆఫీస్ ఓ చోటు, ఉద్యోగులు మరో చోట ఉంటే పని ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ సలహాదారులు,

 

అధికారుల సర్వీస్ రూల్స్ అంశాన్ని పిటిషనర్లు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే వాటిపై తాము వ్యాఖ్యానించలేమని… ఎవరు ఏం మాట్లాడుతున్నారో తమకు తెలుసని హైకోర్టు స్పష్టం చేసింది.న్యాయవ్యవస్థ హుందాతనం ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇక్కడ కార్యాలయాలు సరిపోకపోతే మరో భవనాలను మార్చాలని… కాని ఇతర ప్రాంతాలకు కార్యాలయాలను ఎందుకు తరలిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.