ఇంట్రెస్టింగ్.. కేంద్రానికి ఏపీని మెచ్చుకోక తప్పలేదట

చంద్రబాబు నాయుడి పాలనపై , అధికార పార్టీ పై అనునిత్యం విమర్శలు గుప్పించి జరగని అవినీతి జరిగిందని అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి వైసీపీ , బీజేపీలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ పనిగట్టుకు అవినీతిని వెతికే వైసీపీ కి, బీజేపీ కి కేంద్రం ఏపీ లో అవినీతి లేదంటూ ఇచ్చిన కితాబు చెంప పెట్టు. ఎక్కడ చూసినా అవినీతి జరుగుతూనే ఉంది. పోలవరంలో అవినీతి, రోడ్ల నిర్మాణంలో అవినీతి, కేంద్రం ఇచ్చిన నిధులని సరిగ్గా ఖర్చు చెయ్యడంలో అవినీతి ఇలా ప్రతీ విషయంలో అటు బీజేపీ, ఇటు వైకాపా అవినీతి అవినీతి అని ఆరోపణలు చేసే వైసీపీ,బీజేపీలు అవినీతిని నిరూపించమంటే మాత్రం నిమకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. పూర్తి అవగాహన లేకుండా కొత్త జన సేనాని రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తాడు. ఆంధ్ర ప్రదేశ్ పై అవినీతి మరక లేదు అని ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పారు అని లోకేష్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంనిధుల విషయంలో అవకతవకలు జరిగాయి అని, నిధులను దారి మళ్లించి నీరు-చెట్టు పథకానికి ఉపయోగిస్తున్నారని, ఈ నిధులను స్వాహా చేస్తున్నారు అని వైసీపీ, బీజేపీ నేతలు కేంద్రానికి లేఖలు రాశారు. దీంతో కేంద్రం ఒక బృందాన్ని ఆడిటింగ్ కోసం రంగంలోకి దింపింది. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి, ఆడిట్‌ చేసింది. ఎక్కడా అవినీతి జరగలేదని ఒక్క రూపాయి అవకతవకలు కూడా లేవని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కేందరమే కితాబిచ్చిందని చెప్పారు.. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు, వివ్విధ పథకాలకు ఖర్చు చేసిన నిధులను గురించి వివరణ ఇస్తూ రాష్ట్రంలో 2014 నుంచి 2018 ఆగస్టు వరకూ 16,685 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని మంత్రి చెప్పారు. ఇందుకోసం రూ.653 కోట్లు ఖర్చు చేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 90 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. ఒక్క 2018 సంవత్సరంలోనే రూ.79 కోట్లు ఖర్చు చేసి వెయ్యి కిలోమీటర్ల రోడ్లు వేశాం అని లోకేష్ తెలిపారు. అదే క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిధులను పారదర్శకంగా వినియోగిస్తున్నాం అని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అని ఆయన తెలిపారు.

ఏపీకి వచ్చిన అవార్డులను పురస్కరించుకుని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దేశంలోని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రుల్లో యువకుడు మీరేనేని చాలా బాగా పని చేస్తున్నారు. ఇంకా బాగా పని చేయండి. ఇంకా ఎక్కువ నిధులిస్తాం అని చెప్పారన్నారు. ఇక్కడ బీజేపీ అవినీతి అంటుంటే అక్కడ కేంద్రపెద్దలు ఆంధ్ర ప్రదేశ్ క్లీన్ స్టేట్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు. మంత్రి లోకేష్ చెప్పిన విషయాలు విని లోకల్ నాయకులకు నోటి వెంట మాట రాలేదు. మొతానికి ఏపీ గొప్పతనాన్ని కేంద్రం ఒప్పుకోవటం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది కదూ .

Facebook Comments