జగన్ ముందస్తు ప్రచారం వెనుక ఉన్న అసలు కథ ఇదేనా..?

రెండు, మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి.. ఓ వింత కథ అందరికీ వినిపిస్తున్నారు. అదేమిటంటే.. జనవరిలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని. దీని వెనుక ఉన్న లాజిక్..మ్యాజిక్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆలోచించగా.. ఆలోచించగా.. వైసీపీ నేతలకు తెలిసిందేమిటంటే… త్వరలో పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లకు చేరుతుంది. అప్పుడు… ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్న కారణంగా.. పాదయాత్ర నిలుపుదల చేసి పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టి.. బస్సుయాత్ర చేస్తానని చెప్పుకోవడం కోసం.. ఇలా ప్రకటన చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.

విశాఖలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అందర్నీ ఆహ్వానించారు. మామూలుగా అయితే ఆయన ఎవరి అభిప్రాయాలూ తీసుకోరు. కానీ పెద్ద ప్రజాస్వామ్యవాదిపై ఫీలయ్యాడంటే..ఎదురు తన్నే నిర్ణయాలను తమపై రుద్దే ప్రయత్నం చేయడానికేనని వారికి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎనిమది నెలలలుగా పాదయాత్ర చేస్తున్నారు. కొద్ది రోజులుగా రోజుకు ఐదు కిలోమీటర్లుకూడా నడవలేకపోతున్నారు. ఎలాగూ.. మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయాలనుకుంటున్నాం కాబట్టి పాదయాత్ర ఆపేస్తే బెటర్ అనుకుంటున్నారు.

ముందుగా చెప్పినట్లు 3000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశానని చెప్పుకునేందుకు అప్పటి వరకూ నడిచి ఆపేస్తారన్నట. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కడే తీసుకున్నా…తర్వాత అందర్నీ భాగస్వాముల్ని చేసి యూటర్న్ తీసుకుంటే… పార్టీలో వ్యతిరేకత రాదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు వేల కిలోమీటర్లు పూర్తవడానికి ఇంకా 40 కిలోమీటర్లుఉంది. అది పూర్తయ్యాక…మరో వారంలో.. పాదయాత్ర క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అందుకే జనవరిలో ఎన్నికలొస్తాయని ప్రచారం చేస్తున్నారన్న వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్లారిటీ వారం రోజుల్లోనే రానుంది. ఇప్పటికే పాదయాత్ర వల్ల ఒక్క ఓటు కూడా అదనంగా రావడం లేదని పీకే రిపోర్టులు రావడంతో ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవడం బెటరని భావిస్తున్నారు.

Facebook Comments