రేవంత్ రెడ్డిపై చేసినట్లే అమరావతిపై చేయబోతున్నారా..? ఐటీ దాడుల్లో ఢిల్లీ కుట్ర ఇదేనా..?

మీకు గుర్తుందా.. కొద్ది రోజుల కిందట…రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు. ఆయనను ఇంటికి పిలిపించారు. మూడు రోజులు ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. ఆయన అలా ఇంట్లోకి వెళ్లగానే ఇటు.. కొన్ని డాక్యుమెంట్లు మీడియాకు అందాయి. వాటిని ఎవరు రిలీజ్ చేశారో ఎవరికీ తెలియదు. కానీ అందులో… కోట్లకు కోట్లు.. వందల కోట్లు.. విదేశీ అకౌంట్లు.. రేవంత్ రెడ్డి పెద్ద డాన్ అంటూ… రుజువైనట్లు ప్రచారం చేసేశారు. అసలు తనపై ఎలాంటి ప్రచారం జరుగుతోందో.. రేవంత్ రెడ్డికి కూడా తెలియనంత ప్లాన్డ్‌గా ఈ దుష్ప్రచారం చేశారు. దీనికి మీడియా మొత్తం కేసీఆర్‌దే కాబట్టి అలా చేసింది. అతి తప్పు అని …క్షమాపణ చెప్పకపోతే.. పరువు నష్టం దావా వేస్తానని రేవంత్ హెచ్చరిస్తున్నారు. కానీ టీవీ చానళ్లకు అధికారం అండ ఉంది. అందుకే… రేవంత్ రెడ్డిపై బురదేశామమని ముసి ముసిగా నవ్వుకుంటున్నాయి.

అచ్చంగా అదే ప్లాన్‌ను అమరావతి విషయంలోనూ అమలు చేయడానికి ఢిల్లీ స్థాయి కుట్ర జరుగుతోంది. ఐటీ దాడుల పేరుతో.. అమరావతిలో భారీ స్కామ్ జరుగుతోందనే… దొంగ పత్రాలను రిలీజ్ చేసి… రైతుల్లో .. అనుమానాలు పెంచి… ఇంత కాలం.. తాము చేసిన… కుట్రలకు క్లైమాక్స్ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే… వైసీపీ నేతలు.. బీజేపీ నేతలు ఎన్నెన్నో కుట్రలు చేశారు. అసలు అమరావతిని రాజధానిగా నిర్ణయించిన వారిలో ముఖ్యుడైన ఐవైఆర్ కృష్ణారావు అనే వ్యక్తి.. ఏకంగా పుస్తకాలు రాశారు. ఇప్పుడు నేరుగా బీజేపీలోకి చేరారు కనుక… మొత్తం ఎలా చేస్తే… దుష్ప్రచారం చేయవచ్చో… ఫేక్ డాక్యుమెంట్లన్నీ రెడీ చేశారట.

ఓ దేశంలోని భాగంమైన ఆంధ్రప్రదేశ్‌పై.. మరో రాష్ట్రానికి చెంది.. దేశం మొత్తాన్ని సమానంతో చూడాల్సిన ప్రధాని.. ఓ భాగంగా.. తీవ్ర స్థాయిలో దండెత్తడానికి చేస్తున్న కుట్ర ఇది. చేతనైతే పని చేసుకుని అభివృద్ధి చేసుకోవాలి కానీ.. రోడ్డున పడేసి.. ఇప్పుడు రాజధాని కట్టుకుంటామంటే.. దాన్ని కూడా… ఆపుదామనుకుంటన్నారు. ప్రపంచంలో ఎక్కడా.. రైతులు స్వచ్చందంగా భూములు ఇవ్వరు. కానీ చంద్రబాబుపై నమ్మకంతో ఇచ్చారు. వాళ్లలో అపనమ్మకం సృష్టించి.. ఏదో చేద్దామన్న… కసి కేంద్రంలో కనిపిస్తోంది. దీని వల్ల ఏపీ నష్టపోతుంది. ఏపీ నష్టపోయిందంటే… దేశం నష్టపోయినట్లే. దేశానికి ద్రోహం చేసవాళ్లను ఏమనాలి..? మోడీ అనాలా..?

Facebook Comments