జగన్ దెబ్బకు జనసేనలోకి ఆళ్ళ రామకృష్ణా…?

ఆ ఎమ్మెల్యే జగన్ చెప్పినట్టే చేసిన వీర విధేయుడు. ప్రభుత్వంపై కేసులు వేయమంటే వేశాడు, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోమంటే అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. జగన్‌ ఏది చెబితే అది చేసిన ఆ ఎమ్మెల్యేని, తన సొంత ఖర్చు తో ఓదార్పు యాత్రలో జగన్ కు బాసటగా నిలిచినా ఆ ఎమ్మెల్యేకి కూడా జగన్ షాక్ ఇచ్చారు. పాపం వీర విధేయుడిగా పార్టీ కోసం, జగన్ కోసం కష్టపడిన ఆయన్ను ఇన్ని చేసినా పాదయాత్ర సమయం లో నియోజకవర్గ ప్రజల ముందు తనను అధినేత చిన్నచూపు చూశాడు. టికెట్ ఇవ్వను పొమ్మన్నాడు. ఇంతకీ ఆ నేత ఎవరో కాదు. ఆర్కే.. అల్లా రామకృష్ణా రెడ్డి .

ఒకప్పుడు మన ప్రభుత్వం వస్తే మంత్రి పదవి ఇచ్చే వాడిని అన్నా అన్న జగన్ ఆర్కేని ఇప్పుడు మెడ పట్టి బయటకు నెడుతున్నాడు. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణా రెడ్డి కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందట. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్లతో గట్టెక్కిన ఆళ్ళ ఇప్పుడు జగన్ ఇచ్చిన షాక్ తో ఏ పార్టీలోకి వెళ్ళాలో దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. 24 గంటలు టీడీపీ పై కేసులు వేసి నానా న్యూసెన్స్ చేసిన ఈ నేత ఇప్పుడు టీడీపీలోకి రాలేని పరిస్థితి. జగన్ పార్టీలో ఉండలేని స్థితి.అసలు వివరాల్లోకి వెళ్తే రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో జగన్‌ పర్యటనకు ప్రజలు తండోపతండాలుగా వస్తారని భావిస్తే పదుల సంఖ్యలో జనం రావటంతో జగన్ షాక్ అయ్యారు. దీంతో ఆళ్లతో మాట్లాడలేదట. ఇదేమిటి? ఆళ్ల ఇలా చేశాడు ఆయనను నమ్ముకుంటే ఇంతే సంగతులు అని మరొకరిని చూడండి అని జిల్లా నేతలకు ఆదేశాలు ఇచ్చారట జగన్.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప‌లు విష‌యాల్లో న్యాయ పోరాటం తో దూసుకువెళ్ళిన ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆళ్ళ వైసీపీ ఎమ్మెల్యేగా మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్‌కు చెప్తే ఆయన మౌనం వహించడం వల్ల ఆర్థిక వనరులు సమకూర్చుకుని మళ్ళీ పోటీ చేస్తానని చెప్పారు. అయితే నీపై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్‌ ఇస్తానని చెప్పటంతో ఆళ్ళ షాక్ కి గురయ్యారు. ఇప్పుడు తాజాగా టికెట్ ఇవ్వను పో అనటంతో మూడు నాలుగు రోజుల్లో జనసేన అధినేత పవన్ ని కలిసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నారత ఆళ్ళ. జగన్ మాట విని ఆయన చెప్పింది చేసిన ఆళ్ళకు టీడీపీలోకి రావటానికి ముఖంలేదు. బీజేపీకి అంత సీన్ లేదు. దీంతో పవన్ కళ్యాణ్ జనసేనలో చేరటానికి సిద్ధం అయ్యాడట ..అందుకు తగ్గట్టుగానే మంగళగిరి లో దసరా సందర్భంగా ఆళ్ళ అభిమానూలు ఏర్పాటు చేసిన కొన్ని వైసీపీ బ్యానర్లు తీసి వెయ్యటంతో ఆళ్ళ పార్టీ మారే వాదనకు బలం చేసుకూరినట్టు అయ్యింది. మరి ఇంకేం చేస్తాడు పాపం జనసేనలో చేరటం తప్ప… జగన్ ను నమ్మితే అంతే మరి .

Facebook Comments