జగన్ దెబ్బకు జంప్… ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

ఇదుగో ఈయనే 2019 ఎన్నికల తర్వాత నన్ను సీఎం చేస్తారు అంటూ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగ వేదికపై నుంచి అందరికి పరిచయం చేసిన పీకే అనబడే ప్రశాంత్ కిషోర్ హైద్రాబాద్ నుంచి తట్టా బుట్టా సర్దేశారు. నిజానికి ఎప్పటి మంచో ఆయన వైవిపిలో కనిపింసీజఫామ్ లేదు. పీకే ఏమయ్యాడు అని ఇన్నాళ్లు ప్రశ్నిస్తున్న వారికి ఈ రోజు క్లారిటీ ఇచ్చేసారు. నన్ను సీఎం చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని జగన్ చెప్పుకున్న పీకే ఎందుకు వైసిపి అధినేతను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. జహం ఉం కావడం కష్టమని తెలిపోయిందా లేక జగన్ దెబ్బకు ఆయామ పార్టీ ఎంపీలు, ఎమ్యెల్యేలే పడలేక బయటకు వెళ్లిపోయున్నట్లే పీకే కూడా నీకో నమస్కారం అని దుకాణం సర్దేశారా? పై రెండింటిలో ఒకటి అయితే నిజం కావచ్చు. అంతకుమించిన కారణాలు ఏవీ వుండే అవకాశం లేదు. ఏది ఏమైనా పీకే ఇకపై జగన్ కోసం పని చేయడం లేదన్నది మాత్రం తేలిపోయింది. దోమవరం హైద్రాబాద్ వచ్చిన సదరు పీకే కొన్ని సంచాలన విషయాలు చెప్పారు.

అసలు జగన్ కె కాదు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పని చేయబోనని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. మళ్లీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా తొలిసారి ప్రజలతో ముచ్చటించిన ఆయన… ‘‘2019 ఎన్నికల ప్రచారంలో నేను భాగస్వామ్యం కాదల్చుకోలేదు. గత 4-5 ఏళ్ల నుంచి చూస్తున్న రూపంలో గానీ, పద్ధతిలోగానీ నేను ప్రచారం చేయబోను..’’ అని స్పష్టం చేశారు. ‘‘గత ఆరేళ్లలో నేను పలువురు నాయకులతో పనిచేశాను. ఇప్పుడు నేను తొలిసారి పనిచేసిన గుజరాత్ లేదా నా సొంత రాష్ట్రం బీహార్‌కు వెళ్లాలను కుంటున్నాను…’’ అని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మోడీ ప్రధాని అయ్యేందుకు పీకే నాటి లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెలువడుతున్న వార్తలను సైతం ఆయన కొట్టిపారేశారు. గతేడాది తన తల్లి మరణించిన సమయంలో ప్రధాని మోడీ తనతో మాట్లాడారనీ… అయితే 2015 మార్చి తర్వాత తాను ఇప్పటివరకు మోడీని కలుసుకోలేదని తెలిపారు. ప్రభుత్వంలో చేరిన కొంతమంది కారణంగా ప్రధాని మోడీకి, తనకు కొద్దిపాటి అభిప్రాయభేదాలు తలెత్తాయని కూడా చెప్పారు. ఈ కారణంగానే ఆయన బీజేపీ శిబిరాన్ని వదిలి బయటికి వచ్చేసినట్టు సమాచారం. గతేడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసినప్పటికీ ఆ పార్టీ ఓడిపోఅయింది. అయితే రాజకీయాల్లో అతిపెద్ద సవాలు కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవడమేనని ఆయన వెల్లడించారు. ‘‘కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మేము ఓ ప్రణాళిక ప్రతిపాదించాం.

ఆయన దాన్ని చాలా ఇష్టపడ్డారు. ఎన్నికల సమయంలో మేము ఎలాంటి ఫలితాలు ఆశించామో అంతకంటే మంచి ఫలితాలే వచ్చాయి’’ అని తెలిపారు. బీహార్‌లో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడంలో తన టీమ్ పనితీరు కంటే ఢిల్లీలో అనుసరించిన ఎన్నికల వ్యూహం మరింత మెరుగ్గా ఉండడంతో… ఆమాద్మీకి ధీటుగా పోటీ ఇచ్చేందుకు పంజాబ్‌లో పనిచేయాల్సిందిగా కాంగ్రెస్ తనను సంప్రదించినట్టు ప్రశాంత్ కిశోర్ గుర్తుచేసుకున్నారు. కాగా రాహుల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించాలన్న వాదనలపై ఆయన స్పందిస్తూ… ‘‘రాహుల్‌కి అవకాశం ఇవ్వకుండా, కాంగ్రెస్‌కు ఇతరులు నాయకత్వం వహించాలని మాట్లాడడం సరికాదని” ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

Facebook Comments