జగన్ ను దూరం పెడుతున్న కేంద్రం..

జగన్ కి ఏపీలో ఇప్పటి పరీస్థీతులలో కేంద్ర ప్రభుత్వం అస్సలు సహకరించడం లేదని అనుకుంటున్నారు.వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా బిజెపి ఆడుతున్న డబుల్ గేమ్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నా బీజేపీ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు రెండు వారాలుగా జగన్ ప్రయత్నిస్తున్నా ఆయన అపాయింట్మెంట్ మాత్రం జగన్ కు దొరకడం లేదు.ఈ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఏపీలో రాజధాని తరలింపు వ్యవహారంపై కేంద్రానికి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారు.అయినా అటువైపు నుంచి స్పందన కనిపించడం లేదు.

 

అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత జిఎన్ రావు కమిటీ రిపోర్టును కేబినెట్లో ఆమోదించి, విశాఖను క్యాపిటల్ గా ప్రకటించాలని జగన్ భావించారు.అయితే ఈ విషయాన్ని ముందుగా కేంద్ర పెద్దలకు తెలియజేయాలని భావిన్చరు.అందుకే కమిటీ నివేదికను నేరుగా ఆమోదించకుండా బోస్టన్ కన్సెల్టెంట్ గ్రూప్ నివేదిక పేరు చెప్పి మరికొంత కాలం బిజెపి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు.ఇక ఆ తరువాత ఈ రెండు కమిటీలపై హైపవర్ కమిటీని నియమించారు.ఇలా కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు జగన్ ఇన్ని తంటాలు పడుతున్నారు.ఈ లోపున కేంద్ర బిజెపి పెద్దల చెవిన అమరావతి వ్యవహారాన్ని ప్రస్తావించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.అందుకే ఇప్పటి వరకు అమరావతి పై అధికారిక ప్రకటన చేయకుండా సైలెంట్ గా ఉన్నారు.