జగన్ ఓటమి ఖాయమని పీకేకి తెలిసిపోయిందా..? అందుకే వైదొలిగాడా..?

“ఇడిగో.. ఈయన ప్రశాంత్ కిషోర్.. మోడీని ప్రధానమంత్రిని చేశాడు..నన్ను కూడా ముఖ్యమంత్రిని చేస్తాడు..” అంటూ.. ప్లీనరీలో…జగన్ గొప్పగా పరిచయం చేసిన పీకే.. ఇప్పుడు వైసీపీ నుంచి జెండా పీకేశాడా..? అవునని ఆయనే అంటున్నాడు. తను కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాబట్టి.. తన సంస్థ సిబ్బందితో… సర్వేలు, గట్రా చేయిస్తారు కానీ.. ఇక సలహాలేమీ ఇచ్చేది లేదని చెప్పాడట. హఠాత్తుగా.. మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి పరోక్షంగా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దీంతో వైసీపీలో రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. పీకే ఎందుకు దూరం జరిగాడోనన్న చర్చలు ఊపందుకున్నాయి.

నిజానికి ప్రశాంత్ కిషోర్.. మూడు నెలలకో సర్వే చేసి.. జగన్ కు ఇస్తున్నారు. కనీసం రూ. 400 కోట్లు ఫీజుతీసుకున్నారు కదా అని ఆయన… మొహర్బానీ కోసం… ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం లేదు. కచ్చితంగా ఎన్ని వస్తాయో చెబుతున్నారు. మొదట్లో.. 90 సీట్లు వస్తాయన్నట్లుగా రిపోర్టులు ఇచ్చి.. ఇప్పుడు 30, 40 సీట్లు మాత్రమే వస్తాయని నివేదికలు ఇస్తున్నారు. పీకే ఇచ్చిన సలహాలతోనే జగన్ రాజకీయం చేస్తున్నారు. అయినప్పటికీ సీట్లు తగ్గిపోతున్నాయి. తన సలహాలను సమర్థగా అమలు చేయడంలో..జగన్ తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నారని.. ఆయన తీరు వల్ల తన పేరు పోతోందని.. పీకే భావిస్తున్నారు. జగన్ ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో.. ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల.., తన పేరు అయినా నిలబడుతుందని… వేరే పార్టీల ఖాతాలు వస్తాయని ఆశ పడుతున్నారు.

రాజకీయ సలహాదారులాగ పీకే.. వందల కోట్లు గడించారు. గెలిచే పార్టీ దగ్గరకు చేరి… ఆ గెలుపును తన ఖాతాలో వేసుకుంటారు. అలాగే.. గతంలో జగన్ కూడా గెలుస్తారని ఫీలైపోయారు. హైదరాబాద్ లోనే మకాం పెట్టి.. వందల కోట్లు ఫీజు తీసుకుని.. ఓ యాభై మందితో టీమ్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో.. ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకుని గాలి సర్వేలు చేశారు. అభ్యర్థుల ఎంపికను కూడా చేపట్టారు. ఎంత చేసినా… జగన్ గ్రాఫ్ పెరగకపోగా తగ్గిపోతుంది. ఇలా అయితే తన క్రెడిబులిటి తగ్గిపోతుందని పీకే మెల్లగా దూరం పెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు అది పీక్స్ కి చేరిపోయింది. జగన్ ఎలాగూ ఓడిపోతాడు.. ఆ పరాజయ తన ఖాతాకు ఎందుకని.. ఆయన సైలెంటయిపోతున్నారు. ఇక తన పని ఏమీ లేదని… తన టీమ్.. వైసీపీ కోసం పని చేస్తుందని చెప్పుకొస్తున్నారు. అదీ విషయం..!

Facebook Comments