జక్కంపూడి కి షాక్ ఇచ్చిన జగన్… జగన్ మైండ్ సెట్ ఏంటో అంటున్న యువనేత

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకునే నిర్ణ‌యాలు నేతలకు మింగుడు పడటం లేదు. తీవ్ర అసంతృప్తి తో ఉన్న నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. మొదటి నుండి కాపుల విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న జగన్ కు ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల వేట ఇబ్బందికరంగా మారింది. నాలుగు సంవ‌త్స‌రాలు జెండా మోసిన వారిని ప‌క్క‌న పెడుతున్న జ‌గ‌న్ గోదావరి జిల్లాలలో కూడా ఎవరెవరిని పక్కకు పెడుతున్నారో అనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాపులు అవసరం లేదని భావిస్తున్న జగన్ కాపు నాయకుల టికెట్ల విషయంలోనే మెలిక పెడుతున్నట్టు సమాచారం.

ముఖ్యంగా వంగ‌వీటి రాధా ఎపిసోడ్ సమసిపోక ముందే ఇప్పుడు మ‌రో నేత పై కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. కాపుల్లో గోదావ‌రి జిల్లాలో జ‌క్కంపూడి ఫ్యామిలీని పెద్ద‌దిక్కుగా చెపుతారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో జక్కంపూడి కుటుంబం నుండి రాజా తల్లి విజ‌య‌ల‌క్ష్మికి అవ‌కాశం ఇచ్చారు. ఇక్క‌డ టీడీపీ త‌ర‌పున రాజాన‌గ‌రం నుంచి పెందుర్తి వెంక‌టేష్ గెలిచారు. విజయలక్ష్మి ఓటమి పాలయ్యారు.ఇప్పుడు కుమారుడు రాజాకి ఇక్క‌డ టికెట్ ఇవ్వాలి అని పార్టీ గెలుపు కోసం పాటుపడతామని పార్టీ శ్రేణులు కోరుతున్నా జగన్ మాత్రం ఏ హామీ ఇవ్వటం లేదు. .ఇక వేరే సెగ్మెంట్ రాజ‌మండ్రి అడిగినా జ‌గ‌న్ ఓకే చెప్ప‌లేదు. ఇప్పుడు రాజాని ప‌క్క‌న పెట్టి ఆమె తల్లికే మళ్ళీ టికెట్ ఇస్తారనే సంకేతాలు ఇస్తున్నా అదీ ఏ మేరకో అదం కావటంలేదు. మరో పక్క రాజా తల్లి కూడా తన కొడుకుకు టికెట్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నా జగన్ మాత్రం యువనేతకు అవకాశం ఇచ్చేలా కనిపించటం లేదు. గోదావరి జిల్లాలలో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన వైసీపీ తెలుగుదేశం పార్టీకి ధీటుగా స‌మాధానం చెప్పాలని భావిస్తున్న జగన్ ముఖ్యంగా ప‌శ్చిమ‌లో 9 సెగ్మెంట్ల‌లో అభ్య‌ర్దులు ఇంకా ప్ర‌క‌టించాలి, అలాగే తూ..గో లో 10 సెగ్మెంట్ల‌లో నాయ‌కుల‌ను ప్రకటించాలి. అయితే సరైన నాయకులు లేక జగన్ అభ్యర్థులను ప్రకటించకపోవటం పార్టీకి చాలా మైన‌స్ గా ఉంది.

ఇప్పుడు వంగవీటి రంగా కుమారుడు రాధా బాట‌లోనే జక్కంపూడి రాజా కూడా డైల‌మాలో ఉన్నాడు అని తెలుస్తోంది. రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్న జక్కంపూడి రాజా జగన్ తీరుపై కాస్త అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రాధాలా చెయ్యకుండా మీ కుటుంబం నుండి ఒకరికి టికెట్ కచ్చితంగా ఇస్తారు. మీ అమ్మగారికి అవకాశం వస్తుంది. సర్దుకుపో అని కొందరు సీనియర్ నాయకులు జక్కంపూడి రాజాకు చెప్తున్నారు. మరి రాజా ఓకే అంటారా … లేదా వేరే పార్టీనుండైనా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది వేచి చూడాలి.

Facebook Comments